పేజీలు

28, జులై 2011, గురువారం

నీ కోసం..

ఇంకా ఉదయించని వైశాఖ పరికంపనల్లో ...
నీ కోసం కాచుకుని వున్నాను .
కన్నీళ్లు నిండిన కళ్ళు నీ దారిని పరికిస్తున్నాయి ..
ఇంకా వినిపించని నీ అడుగుల సడి కోసం ..
ఘడియలు వేదన పడుతున్నాయి ..
పైకి రాని మాటల వ్యధ నా నిద్రని ..
బుద్భుదంలా బద్దలు చేస్తోంది ..
ఇంకా ఎన్నాళ్ళు ప్రియతమా ..
వేకువ లా..వెన్నెల లా ..ఒక వెల్లువ గా..రావేమీ..?

కామెంట్‌లు లేవు: