పేజీలు

18, అక్టోబర్ 2011, మంగళవారం

అడుగు ముందుకేసాక..

గుచ్చు కుంటున్న కాలం మేకులను ..
తొలగించడానికి నా శక్తి ఏపాటిది..?
జీవితం సితారు మీద సప్త స్వరాలు
మీటు కుంటూ సాగి పోవడం తప్ప..!
జీవిత ప్రయాణంలో ..
గమ్యాన్ని చేరు కోవడమే ముఖ్యం కాదని..
మొత్తం సుదీర్ఘ ప్రయాణాన్ని
ఆస్వాదించాలని..ఆనందించాలని..నేర్చుకున్నాక..
సంతోషమైనా..విషాదమైనా...
ప్రశ్న అయినా..పరిష్కారమైనా..
నాకు నేనే అయాక..
చూపులకీ ఆలోచనలకీ మధ్య సూత్రాన్ని నేస్తూ..
గమ్యానికీ గమనానికీ నడుమ అగాధాన్ని తుంచుతూ..
నిర్భయంగా అడుగు ముందుకేసాక..
ఇక ఎదురేముంది..?
అన్వేషించిన తీరాన్ని జీవన నౌక చేరబోతోందని..
గమ్యం గమకాలు పలుకుతూ ఎదురోస్తుందని..
వేరే చెప్పాలా...?

కామెంట్‌లు లేవు: