పేజీలు

18, అక్టోబర్ 2011, మంగళవారం

తుమ్ సే అచ్చా కౌన్ హై..?

గుండె లోతుల్లో గునపం లా దిగబడ్డ బాధలకు..
ఉపశమనం లా నువ్వొచ్చావు..
ఆరని జ్వాల లాంటి గాయాలకు లేపనం పూసావు..!
ఆలోచనలతో అల్ల కల్లోల మైన తలను నిమిరి..
తలపులకు నిబ్బరాన్ని అందించావు..!
తీగె మీది నడక లాంటి జీవితానికి ఊతమై నిలిచావు..
"నీకోసమే నేను" అంటూ
మనసు మీద వెన్నెల సంతకం చేసావు..!
అంతటితో ఆగావా..?
"తుమ్ సే అచ్చా కౌన్ హై .." ఆన్నావు..
ఆ మాట దేహాన్ని మంత్రమై స్పృసించింది..
మైమరపించింది..!
కలనై..అలనై..వెన్నెలనై..
పొంగి..ఉప్పొంగి..నింగి కెగసి పోతున్న నాకు..
ఈ ప్రపంచం చాలా ఇరుకుగా తోస్తోంది..
అందుకే ఎగిరోస్తున్నా నీ గుండె గూటిలోకి
గువ్వనై ఒదిగి పోయేందుకు..!

కామెంట్‌లు లేవు: