పేజీలు

4, జనవరి 2012, బుధవారం

నీ ఆగమనం..

బాల భానుడి బంగారు కిరణ మొకటి..
తోలి వేకువతో రహస్యం చెబుతున్న వేళ వచ్చావో..
సంజ కెంజాయ కాంతులు
అంబరాన సంబరంతో ఊసులాడు వేళ వచ్చావో..
పండు వెన్నెల ఓరగా జాజి పూవు మీద ఒరిగి..
జావళీలు పాడుతున్న వేళ వచ్చావో..
నాకు తెలియదు గానీ..
నీ 'ఆగమనం' నా హృదయం లో కూసిన కోయిల..
పడిలేచే సముద్రపు అల..
ఎప్పటికి కరగని  తీయని కల..
మనసులో..జీవితంలో..అది ఓ చెరగని ముద్ర..
నీ రాక తో ..నా అస్తిత్యాన్ని మరచి..
నీలో లయించి పోయిన అనుభూతి..
గుండెలో ఇప్పటికీ పదిలంగా వుంది ..!

కామెంట్‌లు లేవు: