పేజీలు

3, నవంబర్ 2014, సోమవారం

A new life

కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ...
ఎంత ఆనందంగా వుంటుంది ..
కొత్త కారులో వెళ్తుంటే
ఎంత హుషారుగా వుంటుంది ...
కొత్త పుస్తకం తెరవ గానే
ఎంత కమ్మని వాసన  వస్తుంది ......
 
      ఓటమి తరువాత మనం
      ప్రారంభించే కొత్త జీవితం లోనూ
      అంతే తాజా దనం వుంటుంది ...
     
ఓడిపోవడం అంటే ....
ఆ ఓటమికి కారణమైన
బద్దకాన్ని ... నిర్లిప్తతను ... అలసత్వాన్ని .... భయాన్ని ... అభద్రతను ...
శవ పేటికలో పెట్టి పూడ్చి వేయడమే ...
కర్రలు పేర్చి కాల్చేయడమే ....
ఆ బూడిద లోంచి .. ఆ మట్టి కుప్ప లోంచి ...
మరో మనిషిగా అవత రించడమే ....



కామెంట్‌లు లేవు: