పేజీలు

21, డిసెంబర్ 2011, బుధవారం

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

వచ్చేనా నూతన వత్సరం..?

కాలం ఒక ఇంద్ర జాలం..
గమ్మత్తు లెన్నో చేసి ..
గుంభనంగా కదలి పోతూనే వుంటుంది..
నిరంతర ప్రవాహం లా సంవత్సరాలు..
చిటికెలో గిర్రున తిరిగి పోతూనే వుంటాయి..
మోజులెన్నో మరచి రోజులు నిస్తేజంగా దొర్లి పోతున్నప్పుడు ..
కాలం కన్నీళ్ళతో కదలి వెళ్లి పోతున్నప్పుడు..
ఎన్ని నూతన వత్సరాలు  వస్తే నేం..పోతేనేం..?
క్యాలెండర్ లో పేజీలు తిరిగి అంకెలు మారితే..
అది కొత్త ఏడాది అయితే అవచ్చు నేమో కానీ ..
అసలైన నూతన సంవత్సరం వచ్చేది..
బాధలు మరచి మనిషి నిండుగా నవ్వి నప్పుడు ..
ఉన్మాదం ..ఉగ్ర వాదం నశించిన జగతి లో.
శాంతి కపోతాలు ఎగిరి నప్పుడు...
నవ్వుల నదిలో బ్రతుకు నావ రాయంచ లా సాగి నప్పుడు..
ప్రతీ గృహము పల్లవిత మహీ రుహమై ..
పచ్చ తోరణాలతో కళ కళ లాడి నప్పుడు..
అప్పుడే కొత్త ఏడాది మంద హాసం తో
అవని పై అడుగు పెడుతుంది..
మది మది లో ఆనంద నందనాలను పూ యిస్తుంది...!

16, డిసెంబర్ 2011, శుక్రవారం

చెలువం..

చెలువం..
ఎన్నెన్ని బాధల మండు టెండల్లో ఎంతగా కాలి పోయానో..
ఎన్నెన్ని వ్యధల శిలాతలాలను మౌనంగా ఈదుకుంటూ వచ్చానో..
ఎన్ని సార్లు అశ్రువుల తుఫానుల్లో చిక్కుకుని అల్లల్లాడానో..
ఇలా ఎన్నాళ్ళు..?
ఇల్లంతా లేత వెన్నెలలు నింపుతూ ..
పెదవుల్లో నవరసాలను ఊరిస్తూ ..
గుండెల్లో లేత గులాబీ పూలను పూయిస్తూ..
ఇప్పుడైనా ..ఇప్పటికైనా..
నా గుండె గుమ్మంలో ఎవరూ అడుగు పెట్టరేం..
బ్రతుకు బాటలో ఎవరి అడుగు జాదలూ కనిపించవేం..?
మూగబోయిన గొంతులో రాగాలు పలికించరేం..?
మోడు వారిన జీవితంలో.మొలక నవ్వులు కురిపించరేం..?
బ్రతుకుని భవ్యంగా మలచరేం..?
ఒక క్రొత్త దనాన్ని..మనోహరత్వాన్ని ప్రసాదించరేం..?