పేజీలు

21, డిసెంబర్ 2011, బుధవారం

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

వచ్చేనా నూతన వత్సరం..?

కాలం ఒక ఇంద్ర జాలం..
గమ్మత్తు లెన్నో చేసి ..
గుంభనంగా కదలి పోతూనే వుంటుంది..
నిరంతర ప్రవాహం లా సంవత్సరాలు..
చిటికెలో గిర్రున తిరిగి పోతూనే వుంటాయి..
మోజులెన్నో మరచి రోజులు నిస్తేజంగా దొర్లి పోతున్నప్పుడు ..
కాలం కన్నీళ్ళతో కదలి వెళ్లి పోతున్నప్పుడు..
ఎన్ని నూతన వత్సరాలు  వస్తే నేం..పోతేనేం..?
క్యాలెండర్ లో పేజీలు తిరిగి అంకెలు మారితే..
అది కొత్త ఏడాది అయితే అవచ్చు నేమో కానీ ..
అసలైన నూతన సంవత్సరం వచ్చేది..
బాధలు మరచి మనిషి నిండుగా నవ్వి నప్పుడు ..
ఉన్మాదం ..ఉగ్ర వాదం నశించిన జగతి లో.
శాంతి కపోతాలు ఎగిరి నప్పుడు...
నవ్వుల నదిలో బ్రతుకు నావ రాయంచ లా సాగి నప్పుడు..
ప్రతీ గృహము పల్లవిత మహీ రుహమై ..
పచ్చ తోరణాలతో కళ కళ లాడి నప్పుడు..
అప్పుడే కొత్త ఏడాది మంద హాసం తో
అవని పై అడుగు పెడుతుంది..
మది మది లో ఆనంద నందనాలను పూ యిస్తుంది...!

16, డిసెంబర్ 2011, శుక్రవారం

చెలువం..

చెలువం..
ఎన్నెన్ని బాధల మండు టెండల్లో ఎంతగా కాలి పోయానో..
ఎన్నెన్ని వ్యధల శిలాతలాలను మౌనంగా ఈదుకుంటూ వచ్చానో..
ఎన్ని సార్లు అశ్రువుల తుఫానుల్లో చిక్కుకుని అల్లల్లాడానో..
ఇలా ఎన్నాళ్ళు..?
ఇల్లంతా లేత వెన్నెలలు నింపుతూ ..
పెదవుల్లో నవరసాలను ఊరిస్తూ ..
గుండెల్లో లేత గులాబీ పూలను పూయిస్తూ..
ఇప్పుడైనా ..ఇప్పటికైనా..
నా గుండె గుమ్మంలో ఎవరూ అడుగు పెట్టరేం..
బ్రతుకు బాటలో ఎవరి అడుగు జాదలూ కనిపించవేం..?
మూగబోయిన గొంతులో రాగాలు పలికించరేం..?
మోడు వారిన జీవితంలో.మొలక నవ్వులు కురిపించరేం..?
బ్రతుకుని భవ్యంగా మలచరేం..?
ఒక క్రొత్త దనాన్ని..మనోహరత్వాన్ని ప్రసాదించరేం..?

28, అక్టోబర్ 2011, శుక్రవారం

చెలువం..: అసలు ఆలోచించక నువ్వూ..ఎక్కువ ఆలోచించి నేనూ..ఇల...

.: అసలు ఆలోచించక నువ్వూ.. ఎక్కువ ఆలోచించి నేనూ.. ఇలాగే ఎప్పుడో .. అంతమై పోతాం..!
చెలువం..:
 ఆలోచనలతో..ఆవేదనలతో..నిమిత్తం లేకుండా.. కదలి పోతూనే వుంది కాలం.. రోజులు గడిచి పోతున్నా గడియ పడ్డ అదృష్ట ద్వారం తెరుచుకొనే లేదు.. మింగేస్...

చెలువం..: ఒంటరిగా..

చెలువం..: ఒంటరిగా..: ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచం లో కరువు ప్రేమ కే కానీ డబ్బుకి కాదని.. డబ్బు లేకపోవడం దరిద్రం కానే కాదు. మన ప్రేమ ని స్వీకరించే వాళ్ళు లేకప...

చెలువం..: ఏమనుకున్నా ఏముంది..?

చెలువం..: ఏమనుకున్నా ఏముంది..?: ఎలా..ఎలా.. ఈ ప్రపంచాన్ని నమ్మడం..? దేన్నీ నమ్మాలి..ఎవరిని నమ్మాలి..? ఇలా కూడా జరుగుతుందా..? నమ్మకపు పునాదులతో నిర్మించుకున్న జీవిత ...

చెలువం..: అడుగు ముందుకేసాక..

చెలువం..: అడుగు ముందుకేసాక..: గుచ్చు కుంటున్న కాలం మేకులను .. తొలగించడానికి నా శక్తి ఏపాటిది..? జీవితం సితారు మీద సప్త స్వరాలు మీటు కుంటూ సాగి పోవడం తప్ప..! జీవిత ప్...

చెలువం..: తుమ్ సే అచ్చా కౌన్ హై..?

చెలువం..: తుమ్ సే అచ్చా కౌన్ హై..?: గుండె లోతుల్లో గునపం లా దిగబడ్డ బాధలకు.. ఉపశమనం లా నువ్వొచ్చావు.. ఆరని జ్వాల లాంటి గాయాలకు లేపనం పూసావు..! ఆలోచనలతో అల్ల కల్లోల మైన తలను...
 కాలం చూసావా ప్రియతమా కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో.. మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని పంచ రంగులతో అపురూపంగా నేస్తూ.. రోజులన్నీ నిశబ్దంగ...

18, అక్టోబర్ 2011, మంగళవారం

అసలు ఆలోచించక
నువ్వూ..
ఎక్కువ ఆలోచించి
నేనూ..
ఇలాగే ఎప్పుడో ..
అంతమై పోతాం..!

నీవు నాకు..

"నేను నీకెవరిని..నీకే మవుతానని.."
చాలా సార్లు అడిగావు..!
కొన్నేళ్ళుగా అన్వేషణ సాగిస్తూ ..
అంతర్మధనం లో ..ఉపాసన లో..అలమటిస్తూ..
నీ కోసమే వెతుకుతున్న నేను..
నీ దర్శనంతో పులకితుడనై..
ఎన్నో గంటలు ఎన్నో రోజులు నీ గురించిన
ఆలోచన ..ఆరాధన..ఆవేశాలతో..
నిండిన తపస్సు లో మునిగి ..
సంలీనమై..తదాత్మత చెంది..
నీ భక్తుడిని ..నీ ఆరాధకుడిని
అని గర్వ పడిపోతూ కూడా..
నిన్ను వివరించి విశ్లేషించేందుకు..
ఇన్ని వేల అక్షరాలు సృజించినా..
నీవేంటో చెప్పగల
ఒక్క అక్షరాన్నీ సృష్టించ లేక పోయాను..!
ఓ మహోన్నత స్త్రీత్వమా..
నీవు నాకేమవుతా వన్న ప్రశ్న ఎందుకు..?
నీవెవరో ..ఏమిటో ..
నాకు కాకపోతే ఎవరికీ తెలుస్తుంది..?
ఆ అవకాశం.. అర్హత ..ఇంకెవరికీ లేదు.
నాకు తప్ప..!
ఎందుకంటే నేను నీ సన్నిధి లో నిలచి
నీ వ్యక్తిత్యాన్నీ..నీ హుందాతనాన్నీ
నిరంతరం ఆవాహన చేసుకుంటున్న
తాపసిని ..!
నీ పరిచయం ఒక అద్భుత వసంతం..
నీ తీయని తలపు ఓ చలి వేంద్రం.
నీ భావనే వాసంత సమీరం..
ఆ సుమహాసం లాంటి చిరు నవ్వు చాలదూ
నేను చిత్తు అవడానికి..!
ఆ చిలిపి చూపు తట్టు కోడానికి
కవచమే దొరకదాయే..
నా మనసు లో నిలిచి..
నా ఆలోచనలలో తడిచి..
నా అమూల్య మైన కాలంలో
ఎన్ని క్షణాలు తస్కరించ గలిగిన
నీ ప్రత్యేకత ను ఎలా తిరస్కరించ గలను..?
నీ సుకుమార ముగ్ధ మనోహర దివ్య మూర్తిని
నా హృదయ ఫలకం పై నుండి
ఎలా తుడిచి వేయ గలను..?
అది అసాద్యం..!
త్రికరణ శుద్ధి గా నాలోని ప్రతీ అణువూ
నీ కోసం పరిత పిస్తోంది..
తహ తహ లాడుతోంది..
ఇది నిజం..!
కాలం చూసావా ప్రియతమా
కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో..
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
పంచ రంగులతో అపురూపంగా నేస్తూ..
రోజులన్నీ నిశబ్దంగా నిష్క్రమిస్తూనే ఉన్నాయ్
గుడిలోని గంటలా నీపేరు నిరంతరం
గుండెలో మారు మ్రోగుతూనే వుంది..
సరమై..సంబరమై..ముమ్మరమై..అంబరమై..
నీ జ్ఞాపకాల పరిమళాలు అలల్లా..
నన్ను కమ్ముకుంటూనే ఉన్నాయ్
నీ మాటల రాపిడిలో నా నయనాలు..
నక్షత్రాలై మెరిసి పోతుంటే..
పెదవులు పై రంగు రంగుల..
సీతాకోక చిలుకలు ఎగురుతుంటే..
ఒక ఆనందం లోకి ..
ఒక అద్యైతం లోకి..
నే జారి పోతుంటాను..
అనుభూతుల అంచులను చేరుకుంటాను..! 

తుమ్ సే అచ్చా కౌన్ హై..?

గుండె లోతుల్లో గునపం లా దిగబడ్డ బాధలకు..
ఉపశమనం లా నువ్వొచ్చావు..
ఆరని జ్వాల లాంటి గాయాలకు లేపనం పూసావు..!
ఆలోచనలతో అల్ల కల్లోల మైన తలను నిమిరి..
తలపులకు నిబ్బరాన్ని అందించావు..!
తీగె మీది నడక లాంటి జీవితానికి ఊతమై నిలిచావు..
"నీకోసమే నేను" అంటూ
మనసు మీద వెన్నెల సంతకం చేసావు..!
అంతటితో ఆగావా..?
"తుమ్ సే అచ్చా కౌన్ హై .." ఆన్నావు..
ఆ మాట దేహాన్ని మంత్రమై స్పృసించింది..
మైమరపించింది..!
కలనై..అలనై..వెన్నెలనై..
పొంగి..ఉప్పొంగి..నింగి కెగసి పోతున్న నాకు..
ఈ ప్రపంచం చాలా ఇరుకుగా తోస్తోంది..
అందుకే ఎగిరోస్తున్నా నీ గుండె గూటిలోకి
గువ్వనై ఒదిగి పోయేందుకు..!

అడుగు ముందుకేసాక..

గుచ్చు కుంటున్న కాలం మేకులను ..
తొలగించడానికి నా శక్తి ఏపాటిది..?
జీవితం సితారు మీద సప్త స్వరాలు
మీటు కుంటూ సాగి పోవడం తప్ప..!
జీవిత ప్రయాణంలో ..
గమ్యాన్ని చేరు కోవడమే ముఖ్యం కాదని..
మొత్తం సుదీర్ఘ ప్రయాణాన్ని
ఆస్వాదించాలని..ఆనందించాలని..నేర్చుకున్నాక..
సంతోషమైనా..విషాదమైనా...
ప్రశ్న అయినా..పరిష్కారమైనా..
నాకు నేనే అయాక..
చూపులకీ ఆలోచనలకీ మధ్య సూత్రాన్ని నేస్తూ..
గమ్యానికీ గమనానికీ నడుమ అగాధాన్ని తుంచుతూ..
నిర్భయంగా అడుగు ముందుకేసాక..
ఇక ఎదురేముంది..?
అన్వేషించిన తీరాన్ని జీవన నౌక చేరబోతోందని..
గమ్యం గమకాలు పలుకుతూ ఎదురోస్తుందని..
వేరే చెప్పాలా...?

14, అక్టోబర్ 2011, శుక్రవారం

అశ్రువుల్లో తడిసిపోతున్న మౌనం...
కొట్టు మిట్టాడుతున్న ఆఖరి ఆశా దీపం..
ఆన కట్టలు తెంచుకున్న దుఃఖ ప్రవాహం..
ఏరులై పారుతున్న సోక సంద్రం..
నా జీవితానికి నేనే
చితి అంటించు కుంటున్న అనుభూతి..!
అర్ధం కాని అయోమయ స్థితి..!
ఒక్కొక్కటిగా నిష్క్రమిస్తున్నాయా
నా జీవితం లోంచి..
శాంతి..
సంతోషం..
సంతృప్తి...???

13, అక్టోబర్ 2011, గురువారం

ఆలోచనలతో..ఆవేదనలతో..నిమిత్తం లేకుండా..
కదలి పోతూనే వుంది కాలం..
రోజులు గడిచి పోతున్నా గడియ పడ్డ
అదృష్ట ద్వారం తెరుచుకొనే లేదు..
మింగేస్తున్న కాల భూతం కనికరించనే లేదు..
ఆఖరి ఆశ కూడా ఆరిపోయి ..
సన్నటి పొగ మాత్రం వస్తున్నట్టు..
అయిపొయింది..
అంతా అయిపొయింది..
ఎవరూ ఈ జీవితానికి నిప్పంటించింది ..?
ఎవరూ నా కలల సామ్రాజ్యాన్ని
భూస్థాపితం చేసింది..?

ఏమనుకున్నా ఏముంది..?

ఎలా..ఎలా.. ఈ ప్రపంచాన్ని నమ్మడం..?
దేన్నీ నమ్మాలి..ఎవరిని నమ్మాలి..?
ఇలా కూడా జరుగుతుందా..?
నమ్మకపు పునాదులతో నిర్మించుకున్న జీవిత సౌధాలు ..
ఇలా నిట్ట నిలువునా నేల కూలి పోతాయా..?
కళ్ళ వెంట నీళ్ళు రావడం లేదు..
దుఖం పొంగి పొర్లడం లేదు..
మనసు మొద్దు బారి పోయి ..గుండె చప్పుడు ఆగి పోయి..
అయినా జ్ఞాపకం వస్తున్నాయి..
ఒక్కో దృశ్యమూ..ఒక్కో సంఘటనా...
అన్నీ కళ్ళ ముందే ..మనసు వాకిలి ముందే పరచుకున్నాయి..
అయిపొయింది..!
ఇంకా ఎం మిగిలింది..?
భువన వేదిక మీద నిర్మించుకున్న
స్వప్నాల హర్మ్యాలు..

పేక మేడల్లా కూలిపొయాక..!
 
 
 
 
 

ఎవరి కోసమిలా..?

జీవితంలో..
ఈ పరాయితనం ఎందుకేర్పడుతోంది..?
అసలు ప్రశ్నఇదే..!
జీవితం నా నుండీ
ఎందుకు తప్పించుకు పోతోంది..?
ఒకటే సందేహం..!
కీ ఆగిపోయిన గడియారంలా..
నిస్సత్తువగా..నిర్లిప్తంగా..ఎందుకిలా వున్నాను..?
ఎవరి కోసం..?
ఎవరికోసమిలా నా నుండీ విడిపోయి
కొత్త ఆశతో..చూపుతో నిరీక్షిస్తున్నాను..?
హృదయాన్ని విప్పార్చుకుని ..స్వప్న స్వగతాలతో నింపుకుని..
ఏ అడుగు సవ్వడి కోసం ఇదంతా..?
జీవితానికీ నాకూ మధ్య..
ఇంకా ఈ పెనుగులాట దేనికని..?

ఇలాగైనా..

జీవన్మరణ సరిహద్దు రేఖ పై నిలచి...
నరక యాతన పడుతున్న ఈ క్షణాల్లో సైతం
నాకు చావాలని లేదు..
ఒకరిని చంపాలనీ లేదు..
నా పరిధిలో నేను బతకాలని..
మరొకరికి భారం కాకుండా బాధ పెట్టకుండా..బతికినన్నాళ్లు
పావురాయి రెక్కలా..కస్తూరి చుక్కలా..
స్వచ్చంగా..సుగంధ భరితంగా..బతకాలని వుంది..!
కానీ ప్రభూ..
అడకత్తెరలో పోక చెక్కలా నన్నిలా ఇరికించావే..
రెండు వైపులా పదునైన కత్తి అంచులు
కుత్తుకను అదిమేస్తున్నాయి..
బొట్టు బొట్టుగా రాలుతున్న రుధిరాన్ని చప్పరిస్తున్నాయి..
క్షణం ఆలస్యమైతే బతుకు దయనీయంగా ముగిసి పోతుంది.
ఇంకా ఆలోచన దేనికి ప్రభూ..?
ఒక మహా ప్రళయం కమ్ముకొస్తోంది..
ఒక మహా నిస్తేజం ముంచుకొస్తోంది..
జీవితాన్నే కాటేయబోతోంది..
నేను జీవించాలి ప్రభూ..
నా లక్ష్యం కోసం...చేరాల్సిన నా గమ్యం కోసం..!
ఈ మనుషుల అవకాశ వాదాలకీ..
కక్షలకీ..కార్పణ్యాలకీ ..అతీతంగా..
నాదైన ప్రపంచంలో నా మానాన నేను బ్రతుకుతున్నా కదా..
ఇలాగైనా నన్ను బ్రతకనీవా ప్రభూ..? 






29, సెప్టెంబర్ 2011, గురువారం

అమృతానుభూతి..

ఏ నైరూప్య స్వప్నాల లో నుండి ..ఏ అదృశ్య స్వర్గాల లో నుండి ..
ఏ పారిజాత పరిమళ పవనాల మీద నుండి..
ఏ పాలపిట్ట స్వర ఝరీ తరంగాల మీద నుండి..
దిగి వచ్చావో న దరికి ..ఆనంద లహరుల అమృతానుభూతివై..!
నా గుండెల గాజు కుండీలో ఈదే గోల్డ్ ఫిష్ వి..
నా ఊహల ఆల్మైరా లో ఊపిరి తీసే కృష్ణ శాస్త్రి గేయ సంపుటివి..
నా తలపుల గేలరీ లో వ్రేలాడే నికోలస్ రోరిక్ హిమాలయ చిత్రానివి..
నా జ్ఞాపకాల పియానో మెట్లపై నాట్య మాడే బీధోవెన్ స్వర కల్పనవి..
నా భావ లతాగ్రాన విరిసే పుష్పాలనీ..
నా నయనాంచలాల మెరిసే భాష్పాలని..
కలల దారాలకు కలిపి కూర్చి..
కమనీయ కవితా మాలికలుగా తీర్చి..
నీ మేడలో వేయనీ..
నీ ఎదపై నా హృదయ స్పందనంతో సంతకం చేయనీ...
నా ఏకాంతపు చీకటిలో ..
నీ స్వరమే భాస్వరమై జ్వలించనీ...!

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ముకిళిత హస్తాలతో...

ఓ సారి దారి తప్పి
వరదా బురదా అయినంత మాత్రాన..
గోదారి గోదారి కాక పోతుందా..?
ఓసారి చితికిందని చిన్నబోయిందని..
జీవితం జీవితం కాకుండా పోతుందా..?
ఓసారి ఓడినంత మాత్రాన
ఓడినట్టవుతుందా..?
ఓటమిని ఓడించ లేకపోతేనే ఓడినట్టు..!
ఓటమి తల వంచే వరకు..
విధితో పోరాడుతూనే వుంటాను..
 ఒక పోరాటంలా సాగుతున్న జీవితాన్ని..
అలసిపోని ఆరాటంతో అదుపు లోకి తీసుకుని ..
విజయం సాధిస్తాను..
తప్పదు..
ఏదో ఒక రోజు
ఓటమి తన ముకిళిత హస్తాలతో..
విజయాన్ని నాకందిస్తుంది..!

26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఇలా ఎన్నాళ్ళు..?


చెలువం; ఇలా ఎన్నాళ్ళు..?

మరో కోణం


గడియారపు కళ్ళు కరిగిస్తున్న కాలం..
కనుల ముందు నుండి వృధాగా  కదలి పోతూనే వుంది..
నిరుపయోగంగా..నిరుత్సాహంగా..జారి పోతూనే వుంది..
ఏదో చెయ్యాలి
ఏమీ చెయ్యక పోతే
ఈ అసహనాన్ని..అశాంతిని..భరించడం కష్టం.
అవును..ఏదో చెయ్యాలి..!
ఏం చేస్తే మనని పుట్టించిన
భగవంతుడు కూడా సంతోషిస్తాడో
అలాంటి పని ఏదైనా చెయ్యాలి..
పెదవులకి ప్రార్ధనలా
ఈ చేతులకి ఎదుటి వారికీ
సహకరించ గలిగే  అదృష్టం కలగాలి.
అది మరొకరి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చ గలగాలి.
ఓ మంచి మనిషి పడుతున్న బాధలో
రవ్వంత ఓదార్పు నవ్వాలి..
ఒక్క కన్నీటి బిందువు నైనా తుడవాలి.
కరెన్సీ కళ్ళు చూడలేని ..
మరో కోణాన్ని దర్శించాలి..!




22, సెప్టెంబర్ 2011, గురువారం

ఆశల ఆకులన్నీ రాలి..
అవకాశాల రెమ్మలు..విరిగి పోయి..
జీవితం మోడు వారినా..
అంతరాంతరాలలో..విస్తరించిన ఆశయాల వ్రేళ్ళు..
అనుభవాల..సారం  పీల్చుకుని..
నిలువునా జీవం పోసుకుని..
జీవితం చిగురించి మొగ్గ తొడుగు తుంది..
ఓ మధుర సుప్రభాతాన పూచి ఫలిస్తుంది..!
వెన్నెల విరబూసింది..
చల్లని గాలి కెరటాల మీద గుండె గుడిలో పండించుకున్న
ఆశల పల్లవి మూగగా..నిశ్శబ్దంగా వినిపిస్తూంది..
అవును..
ఆ గాలి గుస గుస ..
ఆ ఆకుల రెపరెపల రెక్కల సవ్వడి..
ఆ వెన్నెల తరంగాల లయ విన్యాసం..
నువ్వు వస్తున్నావని చెప్పడానికేనేమో..
అందుకే ఒళ్ళంతా సింగారం..
కళ్ళ నిండా ఆశల బంగారం..

తలచుకుంటేనే మనసంతా ఓంకారం..!



నీ నేను..!

తర తర లాడుతూ తాటాకు మంట లాగా ..
చప్పున ఎగసి చల్లారి పోయేది కాదు నా జ్ఞాపకం నీ లోపల..
నేను చల్లగా అందని జాబిల్లిగా నీ గుండెలో వెలిగే గుప్త జ్వాలను ..
నా జ్ఞాపకాలు నక్షత్రాలై మిణుకు మిణుకు మంటూ ..
నీ హృదయాకాశంలో ఎప్పుడూ నిలిచే వుంటాయి శాశ్వతంగా ..!
నీవు పీల్చే గాలిలోని కమ్మని మట్టి వాసనని నేను..
నీ చుట్టూ కమ్మే వర్ష శీకర శైత్యం లోని ఆహ్లదాన్నే నేను..
నడి రాతిరిలో నీ పసి మనస్సు వెతుక్కునే అమ్మ ఒడి వెచ్చదనాన్ని నేను..
నా వైపుకు ఒక్క క్షణమైనా ఊహను సారించకుండా  ఉండలేని ..
అశక్తతను నీలో పెంచిన నేను ..ఎవరో కాదు..
నీ నీడను..నీ తోడును..!

నిన్ను చూసిన క్షణం నుండి..
తమస్సు భయం తొలగి పోయింది..
నీ కనుదోయి కాంతి పుంజం..
నా గుండెల్లో నిండిన చీకట్లని చీల్చి వేసింది..!

21, సెప్టెంబర్ 2011, బుధవారం

రామ్మా..నా కంటి చెమ్మ..

నాలుగు దిక్కుల మద్య ఒంటరి పక్షి నై..
నీ గూడు కోసం దిక్కు దిక్కునా వెతికాను..
పడమట సంధ్యా రాగాన్ని
తూర్పున ఉదయ గానాన్ని
ఉత్తరాన ఉరిమే మేఘాన్ని
దక్షిణాన మెరిసే మెరుపుని
నీ జాడ చెప్పమని గుచ్చి గుచ్చి అడిగాను..
విసిగించి వేధించాను..
నీ గూడు ఏ దిక్కున వుందో ఎవరూ నోరు విప్ప లేదు..
ఎటు చూసినా రెండే అక్షరాలు..
మంత్రంలా..మౌనంలా..ధ్యానంలా..
అసలేముంది ఆ రెండక్షరాల మాటలో..
ఏమిటీ ఆ అక్షరాల్లోంచి నాలోకి ప్రహహిస్తున్నది?
అక్షరం అక్షరంలో ఆర్ద్రతను రంగరించి..
ఎక్కడ నుండి  నన్ను పిలుస్తున్నావు?
ఈ విశాల విశ్వంలో ఎక్కడని వెతకను నిన్ను?
నువ్వు వస్తావని ఎంత కాలం ఎదురు చూడను?
ఇక ఆగలేను ..వేగలేను..
గుండెను గువ్వలా చేసి ఎగిరి నీ గూటికి రావాలి..
నీ చేతి గోరు ముద్దను కావాలి..
నీ నోటి లాలి పాటను కావాలి..
నీ వరాల మూటను కావాలి..
అమ్మా..నా కంటి చెమ్మా..
నీ ఒడి లో నే కావాలి చందనపు బొమ్మ..

ITS NOT A DREAM

Can you hear the wheels of time..
Rolling in ceaseless motion..
Awakening all human hearts..
It is these ruthless wheels that separated us..?
But yet..,if you look within yourself..,
You will see a bit of me clinging to you.
Doing nothing..but giving shape to a nameless dream..,
No..not a dream...
But..."REALITY..!"

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

WOMEN

Women was made..
Not from man's head..to be above him..
Not from his foot.. to be stamped by him.
But from his side .. to be equal to him.
From near his heart..to be loved by him.
And below his arm to be protected by him..!

OCEAN of LOVE

Daily in the morning..i see some dew drops..
on the breasts of the leaves of grass..,
But when the sun rises..
I know not where they disappear..!
Similarly your memory emerges each morning in my mind..,
But it does not disappear..it resides there throughout the day and night..
sublimates into my dreams..
Studded like dew drops into the marrow of my heart.
In the morning again i find dew drops like pearls twinkling in sun..
Rising and sinking daily..
In tha ocean of LOVE..1

FOR YOU..!

Dont you believe, when i say that i have something..
That can be called my own.
It is a dream..,a dream of my love!
A dream fragranced with memories,
Built on promises.., strengthened by hopes..,
More than anything else..,
It is the very embodiment of faith and love!
People dream at night..when the bright day ends..and sometimes even during day..,
Hoping to fulfil thier desires..that mould in thier minds..!
But my dream..i dream by day and night..
which makes me laugh often..but sometimes brings tears too..,
When it exists it is my own, never can it be disowned..
For it never ceases to exist..!
But how can one own a dream..it is but true..,
You are my dream..which gives me hopes of life..,
gives strength and helps to purify my soul..
Which fills my heart with love for YOU..!

DAY and NIGHT

I loved you ...
as i woke up and as i slept.
And as the days grew shorter..
I loved you even more.
I spent years loving you..
My life is slipping through my fingers..

ADMIRING and LOVING you...!

AGONY

The song i came to sing..
remains unsung to this day.
I have spent my days in stringing and in unstringing my instrument.
The time has not come true..
The words have not been rightly set..
Only there is the agony of..
wishing in my heart..!
మోయలేని జ్ఞాపకాల బరువుల ఒత్తిడిలో ..
అంతు లేని ఆలోచనల ఆవేశపు ఆవేగంలో..
తప్పించు కోలేని తలపుల తపన తీష్ణతలో ..
ఆవేదన ఆరామంలో ..ఆకాశపు ఆలవాలంలో..
ఏది వసంతమో..ఏది గ్రీష్మమో..
ఎప్పుడు వస్తుందో..వెళ్తుందో ఏమో..
నేను గుర్తించనే లేదు ఈనాటి వరకు..!
ఏరు సాగి వెళ్ళాలంటే రాళ్ల దెబ్బలు..
మొక్క మ్రాను కావాలంటే వడ దెబ్బలు..
శిల శిల్పంగా మారాలంటే సుత్తి దెబ్బలు..
మనిషి మనీషిగా ఎదగాలంటే ..ఎదురు దెబ్బలు
ఎంతో అవసరం..!

శిఖరాగ్రాన...

మార్గం కఠినమైనా..ప్రయాణం ఆయాస పూరితమైనా ..
అడుగు తీసి అడుగు వేయడం కష్టమైనా ..
నిరాశ చెందే ప్రశ్నే లేదు..గమ్యాన్ని విడిచేది లేదు..
విజయం సాధించే యత్నంలో వీగి నట్లు అనిపించినా
లక్ష్యం సాధించ లేనని మనసు భ్రమ పడినా..
గమ్యాన్ని విడిచేది లేదు..
ప్రపంచం అంతా కఠినంగా..అన్యాయంగా కనిపించినా..
ఈ పోరాటం ఆగదు..
జీవిత శిఖరాగ్రాన ఓ రోజు ..
విజయ కేతనం ఎగరక తప్పదు...
ఆకులు రాల్చిన చెట్టు మోడు  లాగా..
అప్పుడప్పుడు వాడి..ఎండి..కనిపించినా.
చిగిర్చి..పుష్పించి..
మళ్లీ కొత్త శోభతో..
ప్రకాశిస్తుంది  "ధర్మం"
ఎప్పుడొస్తావో..ఏ పూట ఏనాడు వస్తావో..
నీకోసమే ఎదురు చూస్తున్నాను..
కేవలం నీకోసమే..
నిన్ను చూడాలన్న తపన తోనే రోజులు గడుపుతున్నాను..
నా కవి హృదయం నుండి ..
కవితలు రాలి పడే సమయంలో వస్తావో..
నా కవి తలపులు పండిన ...
ప్రాతః కాలాన వేం చేస్తావో ..
నా కవితల కట్టల తో ..
సంతోషపు చెలియలి కట్టలే కడతావో..
ప్రేమ తో ప్రభాతంజలి ఘటిస్తావో..
పూల హారమే తెస్తావో..
నీ గుండె కొమ్మ పై ..
ఊయల లే ఊగిస్తావో..
నీ కోసమే ఈ ఎదురు చూపు..
ఎదురు చూపులు గుండెల్లో .. ముళ్ళై దిగాక ముందే..
వచ్చేయ్ ప్రియతమా..!

19, సెప్టెంబర్ 2011, సోమవారం

నీవో ప్రశ్నవి ..
సమాధానం కోసం అన్వేషిస్తున్నావు .
నేనో సమస్యను ..
పరిష్కారాన్ని వెతుకుతున్నాను.
నీవు..నేను..కలిస్తే
ప్రశ్నలూ ..సమస్యలూ ఇంకెక్కడా.?
పరిష్కారాలూ ..సమాధానాలే మిగులుతాయ్...!
జీవితం కల్లోల కడలిలా విరుచుకు పడినా..
శిలల్లాగా స్థిరమైనవి వున్నాయి రెండు..
సాటివాని కష్టం కని విడిచే నిట్టుర్పు..
స్వంత కష్టంలో చూపే అంతులేని ఓర్పు..!
భవిష్యత్తు గురించిన "భయం" నుండి..
రేపును గురించిన "ఆదుర్దా" నుండి..
ఇతరుల పట్ల "ఆగ్రహం" నుండి..
సమస్యలకు జంకే "పిరికితనం" నుండి..
అవకాశాన్ని చేయి విడిచే "ఓటమి" నుండి..
విధి నిర్వహణలో "సోమరితనం" నుండి..
ఓ ప్రభూ..
నాకు విముక్తి కలిగించు..!
కాలం కదల దేమిటి?
కంటి ముందు కనిపించే కర్తవ్యం
గడ్డ కట్టుకు పోయి  నా మనసిలా నిర్వికారమై పొయిందేమిటి?
ఈ కష్టాల కడలిలో ..
స్పృతుల కెరటాలు కూడా కదల వెందుకు..?
విజ్ఞానపు వెన్నెల మీద  దట్టమైన మబ్బులు ఇలా పరచు కున్నాయేమిటి..?
వ్యక్తిత్యపు దీపం మీద చీకటి తుఫాను ఇలా విరుచుకు పడిందేమిటి..?
కధ ముగింపు కొస్తున్నా ఇంకా వ్యధ తొలగి పోదేమిటి..?
ఈ విశాల విశ్వం మీద వెలుగులు ప్రసరించ వలసిన నేను..
ఈ అగడ్తలను జయించి విజయం సాధించాల్సిన నేను..
కష్టానికీ..కన్నీటికీ..స్థానం లేకుండా చెయ్యాల్సిన నేను..
ఇవాళ ..ఇలా ..ఈ చిక్కని చీకటిలో.. వెచ్చని కన్నీటి లో ..
ఒంటరి తనంతో..రుద్ధ మైన కంఠంతో ..
విషాద గీతాన్ని వినిపిస్తున్నానని...విస్తు పోతారెందుకు..?
ఆయుధాన్ని నేను వదల లేదు..
పోరాటాన్ని ఆపలేదు..
అలసట తీరక అడుగు ముందుకే నని వేరే చెప్పాలా...?

గుండెలో పొంగే అనురాగం ..
గొంతులో రాగమై మ్రోగినప్పుడు...,
ఎద లోని సంతోష సందోహం..
పెదవిపై చిరునవ్వుగా మెరిసి నప్పుడు ..,
మనసులోని మమతా మధురిమ ..
మాటలలో మధువై ఒలికి నప్పుడు..,
ఇంకేం కావాలి?
బ్రతుకు లోని మంచితన మంతా..
మానవతా సుమమై పరిమళాలు వెదజల్లదూ?.


నా జీవితపు సంధ్య ..
రాత్రిలో పడకు ముందే వస్తా నన్నావే..
నా హృదయ నందన వనంలో..
నిరాశ శిశిరం ప్రవేశించక ముందే వస్తానన్నావే...
నా స్వప్న పరీరంభణాలలో..
సావేరి రాగం వినిపించక ముందే వస్తానన్నావే..
ప్రభూ..ముంచుకొస్తున్న ఈ విషాద సమయంలో ..
మిసిమి వెన్నలవై  లాలింప వేమి..
వాత్సల్య హస్తమై ఆదుకొన వేమి..?

ఇలా ఎన్నాళ్ళు..?

అకుంటిత దీక్షతో..అచంచల విశ్వాసంతో..
అపూర్వ మైన మనోబలంతో..అనుక్షణ ధ్యానం తో ..
నీ పర్వతాన్ని అధిరోహిస్తూనే వున్నాను..
నీ కొండ నింగిని పొడిచి ఎదుగుతూనే వుంది..
ప్రభూ ఇలా ఎన్నాళ్ళు..?
ఇంతటితో కాలానికి కళ్ళెం వేయి..
ఈ జీవన యాత్రకు ముగింపు నివ్వు..


18, సెప్టెంబర్ 2011, ఆదివారం

మనసున  మల్లెల మాల లూగించి...
ఆంతర్యాన్ని ఆర్ధ్రతతో నింపి..
భువి నుండి దివికి తీసుకెళతా వనుకుంటే..
మనసున మహరణ్యాలు మండించి..
ఆంతర్యాన అగ్ని పర్వతాలు రగిల్చి..
దివి నుండి భువికి
అమాంతంగా పడేసావెందుకు  ప్రభూ..!
మమతల మందిరం అలికి ముగ్గులు పెట్టి..
కోర్కెల గుమ్మానికి ఆశల తోరణం కట్టి..
కోటి దివ్వెల వెలుగులా..నీవు వస్తావని..
నేనిలా మిగిలి వున్నాను నీకోసం..
ఆశా నిరాశల మధ్య నలిగిన రోజుల్ని మరపిస్తావని..
ఆవేదనలతో రగిలిన హృదయాన్ని మురిపిస్తావని..
సంఘర్షణలతో..సతమత మవుతున్న సంఘటనలకు
ఆహ్లాద మైన ముగింపు నిస్తావని..
నిర్వేదంతో నిరంతరం తల్లడిల్లు తున్న జీవితంలో..
అందమైన మార్పును తెస్తావని..
నేనింకా..నీకోసమిలా..
ఎదురు తెన్నులు చూస్తూనే వున్నా..
ఈ మనసనే తీగకు మమతల మారాకులు తొడిగి..
మార్ధవపు మలయ మారుతంతో..
ప్రేమ సౌరభాన్ని గుండెల్లో పరుస్తావని..
ఆవేదన కోరని ఆకాంక్షల తో..
ఆవేశము నెరుగని ఆశలతో..
ఆర్తి సోకని ఆనందంతో..
అపురూపంగా ఈ జీవితమంతా నీతో గడపాలన్న అనురక్తితో
ఆహ్లాదం నిండిన మనసుతో..
ఆహ్వానిస్తున్నా నిన్ను నా కలల ప్రపంచం లోకి..
వచ్చేయ్ ప్రియతమా..
వినూత్న పధంలో నను నడిపేందుకు...!                
                  





17, సెప్టెంబర్ 2011, శనివారం

కరిగి పోనీకు కలలా...

నీ పాదం నా హృదయంలో
తొలి అడుగు వేసాక..
నీవు కనిపించడం .. వినిపించడం..
క్షణం ఆలస్యమైనా ..
తట్టుకోలేక ..తమాఇంచుకోలేక
తమకంతో నేనూగి పోతుంటాను..
నన్నిలా నడి ఏటిలో వదలొద్దు..
ఆకాశ మార్గంలో జార విడవొద్దు..
జీవితాన్ని సాగి పోనీ నీతో..
పునీతం కానీ నన్ను నీ ఒడిలో .
నేడు నీ వెలుగులో..ప్రేరణలో..
నీ స్పర్శలో..నీ ఉత్తేజంలో..
నీవు నాలో కదిలిస్తున్న
రస సమ్మేళన సంయోగ పరిణామ తేజంతో..
సనాగ్రత వైపు అడుగులేస్తున్నాను..
నన్నిలాగే సాగనీ..
నీ ముందు మోకరిల్లి  అడుగుతున్నాను..
నా కల చెదర గొట్టకు..
మన ఈ బంధాన్ని చెదిరి పోనీకు..
నువ్వు ..నీ స్పర్స లేకపోతే ..
నేను జీవించ నూ లేను..
మరణించ నూ లేను..

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

అయితేనేం...

ఎవరూ లేక.. ఏ ఒక్కరూ కలసి రాక..
కాల తీరాన ఒంటరిగా నడిచాను
మమతలకీ మమకారాలకీ నోచుకోక ..
బీడునై మోడునై ఎండి పోయాను
ఎన్నో సార్లు చావు బతుకుల సరిహద్దు రేఖపై  
నిలబడి..ఊగిస లాడాను...                                                      
అయితేనేం..
అన్నింటిని దిగమింగుకుని ..
వెన్నెల రాత్రి భావుకతామృతాన్ని
బంగారు దోసిళ్ళతో తాగి అమర జీవి నయ్యాను..
ఇక మరణం ఎలా సంభవం?
వీళ్ళ కేవరికీ తెలీదు ..
నా మనసు నుండీ జల జల కురిసేది ..
అమృతమని..!

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఇంకా..ఇలా..

మంచి మనసుకి రూపం..
మంచి మనసుకి భాష..                                                         
అవసరం లేదు..
మనిషిని మనిషి అర్ధం చేసుకోవడం ఒక కళ..
ఆ కళతో కళ కళ లాడే ఒక ఆత్మ దర్శనం కోసమే
ఈ ఊపిరి ఇంకా ఇలా రెప రెప లాడుతోంది.. 




31, జులై 2011, ఆదివారం

మనసు వెల్ల వేసినట్టుగా అనిపిస్తుంది ఒక్కో క్షణం ..
చిత్ర విచిత్ర మైన భావాల కలయికతో కలవరంగా వుంటుంది ,,
కానీ కాలం అదృశ్య హస్తం ..
రంగుల పైన రంగులు పులుముతూ వుంటుంది ..
వాటి ని అర్ధం చేసుకోడంలోనే జీవితం హరించి పోతుంది..
దేన్నైనా అపార్ధం చేసుకోడం కాదు ..
అర్ధం చేసుంటే ..జీవితాలకి జీవితాలే పలకరిస్తాయి ..
హృదయాల్లో రంగుల వెలుగును విరజిమ్ముతాయి ..

తిరిగి...

దిశాం చలాన్ని కమ్మి వేస్తున్న తపస్సులా..
ఏదో దుఃఖ పరంపర గుండెను తెర్లుతోంది ..
ఈ చిరకాల దుఃఖానికి అంతం ఎప్పుడో..!
ఏ సునేత్రాల నుండి ప్రసరించే సుధా కిరణం ..
ఈ జీవితాన్ని రసస్లావితం చేస్తుంది?
మేధస్సు ఎందుకో దుఃఖ మేఘా రణ్యం లో ..
సుదీర్ఘ తపస్సుకు పూనుకుంది ..!
శరీరాన్ని ..కాలం తో పాటు ఆయువునీ
హరిస్తున్న ఈ సమాధి ఎప్పుడు ముగుస్తుందో తెలీదు ..
ఆయినా....
ఎన్నడో ఒక తరంగం వీస్తుంది ..
గాలి అలలుగా చెలరేగుతుంది ..
తరుణ కెరటాలు లేస్తాయి ..
రసవత్తర దృశ్యంలో ఆగిన కల
తిరిగి రస రమ్యంగా ప్రారంభ మవుతుంది ..!



 

29, జులై 2011, శుక్రవారం

ఆశా దీపం..

దూరాన..ఆకాశాన.. మిణుకు మిణుకు మంటూ ఓ ఆశా దీపం ..
దారీ తెన్ను తెలియని నాకు అభయ మిచ్చే అఖండ దీపం ..
ఆకాశాన వున్నా..అంతరాన  వున్నా ..
కొండ గాలి వీచినా..పెను తుఫాను కమ్ముకున్నా..
ఆరిపోదు ఆ దీపం ..
నాకు దారి చూపక మానదు ..
నూనె లేదా దీపానికి ..వత్తి లేదా దీపానికి ..
ప్రమిద అనేది అసలే లేదు ..
వున్నది ఒకటే ..
గుండెలో పరచుకున్న ఆర్ద్రత ..
అదే నాలో నిరంతరం..అనుక్షణం .
దేదీప్యమానంగా వెలిగే మణి దీపం



 
నా చుట్టూ కోటి దీపాలు ..
మహోజ్వల కాంతి పుంజంతో మిరుమిట్లు గొలిపే మణులు ..
వాటి మధ్య మిణుకు మిణుకు మంటూ నేను..
నలుగురిచే మెప్పు పొందే వెలుగు జిలుగులు నాలో వున్నా లేకున్నా
పది మంది ఆదరించు వ్యక్తిత్యపు కాంతి నాకున్న లేకున్నా
నన్ను నేను గౌరవిస్తూ ..
జీవితాన్ని ప్రేమిస్తూ ..
హృదయంతో నవ్వుతూ..
దట్టమైన చీకటిలో సైతం ..
చిరు కాంతిని పంచాలని ..
నేను వెలుగుతూనే వుంటాను!
దుఖమైనా..సంతోషమైనా ...పండినప్పుడు ..
ఒకే రూపాన్ని సంతరించుకుంటాయి ..
ఆ రూపానికి స్వరూపం వుండదు ..
ఆ భావానికి భాష్యం తెలీదు ..
ఆ షుప్త చేతనంలోని సుడిగాలి ..
సుషుప్తిలోనే విరగాలి ..
అందాకా భావభావం తప్పదు ..