పేజీలు

11, జులై 2011, సోమవారం

ప్రేమ చినుకులు..

ఈ లోకంలో ప్రేమకి మించింది ఏముంది?
ప్రేమ భావన అనేది జీవన పరిణితికి పరాకాష్ట ..
అమ్మ..నాన్న..అక్క..అత్తా..పిన్ని.తాత..
ఈ బంధాలన్నీ ఎంత గొప్పవి?
అయినా  మనుషులెందుకు ఈ అపురూప మైన రాగ బంధాల్ని మరచి ..
డబ్బు వెంట పరుగులు తీస్తున్నారు?

   


ఒకా నొక ఆత్మ బంధం కోసం..

ఏ కల్మషము లేని స్వచ్చ మైన  ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు  
ఇంతగా ఆరాట పడుతోంది?
అగరు పొగల ధూపం లోని పవిత్రత ..
వైశాఖ మాసపు వాన జల్లులలోని ఆహ్లాదం ...
 లేత తమలపాకు మీది పసుపు గణపతిని చూసినప్పటి భక్తీ భావం.. 
మంత్ర పుష్పం వింటున్నప్పుడు కలిగే పరవశం ..
ఏ ఆత్మ స్పర్శలో దర్శన మిస్తుందో కదా...