పేజీలు

21, డిసెంబర్ 2011, బుధవారం

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?

వచ్చేనా నూతన వత్సరం..?

కాలం ఒక ఇంద్ర జాలం..
గమ్మత్తు లెన్నో చేసి ..
గుంభనంగా కదలి పోతూనే వుంటుంది..
నిరంతర ప్రవాహం లా సంవత్సరాలు..
చిటికెలో గిర్రున తిరిగి పోతూనే వుంటాయి..
మోజులెన్నో మరచి రోజులు నిస్తేజంగా దొర్లి పోతున్నప్పుడు ..
కాలం కన్నీళ్ళతో కదలి వెళ్లి పోతున్నప్పుడు..
ఎన్ని నూతన వత్సరాలు  వస్తే నేం..పోతేనేం..?
క్యాలెండర్ లో పేజీలు తిరిగి అంకెలు మారితే..
అది కొత్త ఏడాది అయితే అవచ్చు నేమో కానీ ..
అసలైన నూతన సంవత్సరం వచ్చేది..
బాధలు మరచి మనిషి నిండుగా నవ్వి నప్పుడు ..
ఉన్మాదం ..ఉగ్ర వాదం నశించిన జగతి లో.
శాంతి కపోతాలు ఎగిరి నప్పుడు...
నవ్వుల నదిలో బ్రతుకు నావ రాయంచ లా సాగి నప్పుడు..
ప్రతీ గృహము పల్లవిత మహీ రుహమై ..
పచ్చ తోరణాలతో కళ కళ లాడి నప్పుడు..
అప్పుడే కొత్త ఏడాది మంద హాసం తో
అవని పై అడుగు పెడుతుంది..
మది మది లో ఆనంద నందనాలను పూ యిస్తుంది...!