పేజీలు

31, జులై 2011, ఆదివారం

మనసు వెల్ల వేసినట్టుగా అనిపిస్తుంది ఒక్కో క్షణం ..
చిత్ర విచిత్ర మైన భావాల కలయికతో కలవరంగా వుంటుంది ,,
కానీ కాలం అదృశ్య హస్తం ..
రంగుల పైన రంగులు పులుముతూ వుంటుంది ..
వాటి ని అర్ధం చేసుకోడంలోనే జీవితం హరించి పోతుంది..
దేన్నైనా అపార్ధం చేసుకోడం కాదు ..
అర్ధం చేసుంటే ..జీవితాలకి జీవితాలే పలకరిస్తాయి ..
హృదయాల్లో రంగుల వెలుగును విరజిమ్ముతాయి ..

తిరిగి...

దిశాం చలాన్ని కమ్మి వేస్తున్న తపస్సులా..
ఏదో దుఃఖ పరంపర గుండెను తెర్లుతోంది ..
ఈ చిరకాల దుఃఖానికి అంతం ఎప్పుడో..!
ఏ సునేత్రాల నుండి ప్రసరించే సుధా కిరణం ..
ఈ జీవితాన్ని రసస్లావితం చేస్తుంది?
మేధస్సు ఎందుకో దుఃఖ మేఘా రణ్యం లో ..
సుదీర్ఘ తపస్సుకు పూనుకుంది ..!
శరీరాన్ని ..కాలం తో పాటు ఆయువునీ
హరిస్తున్న ఈ సమాధి ఎప్పుడు ముగుస్తుందో తెలీదు ..
ఆయినా....
ఎన్నడో ఒక తరంగం వీస్తుంది ..
గాలి అలలుగా చెలరేగుతుంది ..
తరుణ కెరటాలు లేస్తాయి ..
రసవత్తర దృశ్యంలో ఆగిన కల
తిరిగి రస రమ్యంగా ప్రారంభ మవుతుంది ..!