పేజీలు

28, అక్టోబర్ 2011, శుక్రవారం

చెలువం..: అసలు ఆలోచించక నువ్వూ..ఎక్కువ ఆలోచించి నేనూ..ఇల...

.: అసలు ఆలోచించక నువ్వూ.. ఎక్కువ ఆలోచించి నేనూ.. ఇలాగే ఎప్పుడో .. అంతమై పోతాం..!
చెలువం..:
 ఆలోచనలతో..ఆవేదనలతో..నిమిత్తం లేకుండా.. కదలి పోతూనే వుంది కాలం.. రోజులు గడిచి పోతున్నా గడియ పడ్డ అదృష్ట ద్వారం తెరుచుకొనే లేదు.. మింగేస్...

చెలువం..: ఒంటరిగా..

చెలువం..: ఒంటరిగా..: ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచం లో కరువు ప్రేమ కే కానీ డబ్బుకి కాదని.. డబ్బు లేకపోవడం దరిద్రం కానే కాదు. మన ప్రేమ ని స్వీకరించే వాళ్ళు లేకప...

చెలువం..: ఏమనుకున్నా ఏముంది..?

చెలువం..: ఏమనుకున్నా ఏముంది..?: ఎలా..ఎలా.. ఈ ప్రపంచాన్ని నమ్మడం..? దేన్నీ నమ్మాలి..ఎవరిని నమ్మాలి..? ఇలా కూడా జరుగుతుందా..? నమ్మకపు పునాదులతో నిర్మించుకున్న జీవిత ...

చెలువం..: అడుగు ముందుకేసాక..

చెలువం..: అడుగు ముందుకేసాక..: గుచ్చు కుంటున్న కాలం మేకులను .. తొలగించడానికి నా శక్తి ఏపాటిది..? జీవితం సితారు మీద సప్త స్వరాలు మీటు కుంటూ సాగి పోవడం తప్ప..! జీవిత ప్...

చెలువం..: తుమ్ సే అచ్చా కౌన్ హై..?

చెలువం..: తుమ్ సే అచ్చా కౌన్ హై..?: గుండె లోతుల్లో గునపం లా దిగబడ్డ బాధలకు.. ఉపశమనం లా నువ్వొచ్చావు.. ఆరని జ్వాల లాంటి గాయాలకు లేపనం పూసావు..! ఆలోచనలతో అల్ల కల్లోల మైన తలను...
 కాలం చూసావా ప్రియతమా కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో.. మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని పంచ రంగులతో అపురూపంగా నేస్తూ.. రోజులన్నీ నిశబ్దంగ...

18, అక్టోబర్ 2011, మంగళవారం

అసలు ఆలోచించక
నువ్వూ..
ఎక్కువ ఆలోచించి
నేనూ..
ఇలాగే ఎప్పుడో ..
అంతమై పోతాం..!

నీవు నాకు..

"నేను నీకెవరిని..నీకే మవుతానని.."
చాలా సార్లు అడిగావు..!
కొన్నేళ్ళుగా అన్వేషణ సాగిస్తూ ..
అంతర్మధనం లో ..ఉపాసన లో..అలమటిస్తూ..
నీ కోసమే వెతుకుతున్న నేను..
నీ దర్శనంతో పులకితుడనై..
ఎన్నో గంటలు ఎన్నో రోజులు నీ గురించిన
ఆలోచన ..ఆరాధన..ఆవేశాలతో..
నిండిన తపస్సు లో మునిగి ..
సంలీనమై..తదాత్మత చెంది..
నీ భక్తుడిని ..నీ ఆరాధకుడిని
అని గర్వ పడిపోతూ కూడా..
నిన్ను వివరించి విశ్లేషించేందుకు..
ఇన్ని వేల అక్షరాలు సృజించినా..
నీవేంటో చెప్పగల
ఒక్క అక్షరాన్నీ సృష్టించ లేక పోయాను..!
ఓ మహోన్నత స్త్రీత్వమా..
నీవు నాకేమవుతా వన్న ప్రశ్న ఎందుకు..?
నీవెవరో ..ఏమిటో ..
నాకు కాకపోతే ఎవరికీ తెలుస్తుంది..?
ఆ అవకాశం.. అర్హత ..ఇంకెవరికీ లేదు.
నాకు తప్ప..!
ఎందుకంటే నేను నీ సన్నిధి లో నిలచి
నీ వ్యక్తిత్యాన్నీ..నీ హుందాతనాన్నీ
నిరంతరం ఆవాహన చేసుకుంటున్న
తాపసిని ..!
నీ పరిచయం ఒక అద్భుత వసంతం..
నీ తీయని తలపు ఓ చలి వేంద్రం.
నీ భావనే వాసంత సమీరం..
ఆ సుమహాసం లాంటి చిరు నవ్వు చాలదూ
నేను చిత్తు అవడానికి..!
ఆ చిలిపి చూపు తట్టు కోడానికి
కవచమే దొరకదాయే..
నా మనసు లో నిలిచి..
నా ఆలోచనలలో తడిచి..
నా అమూల్య మైన కాలంలో
ఎన్ని క్షణాలు తస్కరించ గలిగిన
నీ ప్రత్యేకత ను ఎలా తిరస్కరించ గలను..?
నీ సుకుమార ముగ్ధ మనోహర దివ్య మూర్తిని
నా హృదయ ఫలకం పై నుండి
ఎలా తుడిచి వేయ గలను..?
అది అసాద్యం..!
త్రికరణ శుద్ధి గా నాలోని ప్రతీ అణువూ
నీ కోసం పరిత పిస్తోంది..
తహ తహ లాడుతోంది..
ఇది నిజం..!
కాలం చూసావా ప్రియతమా
కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో..
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
పంచ రంగులతో అపురూపంగా నేస్తూ..
రోజులన్నీ నిశబ్దంగా నిష్క్రమిస్తూనే ఉన్నాయ్
గుడిలోని గంటలా నీపేరు నిరంతరం
గుండెలో మారు మ్రోగుతూనే వుంది..
సరమై..సంబరమై..ముమ్మరమై..అంబరమై..
నీ జ్ఞాపకాల పరిమళాలు అలల్లా..
నన్ను కమ్ముకుంటూనే ఉన్నాయ్
నీ మాటల రాపిడిలో నా నయనాలు..
నక్షత్రాలై మెరిసి పోతుంటే..
పెదవులు పై రంగు రంగుల..
సీతాకోక చిలుకలు ఎగురుతుంటే..
ఒక ఆనందం లోకి ..
ఒక అద్యైతం లోకి..
నే జారి పోతుంటాను..
అనుభూతుల అంచులను చేరుకుంటాను..! 

తుమ్ సే అచ్చా కౌన్ హై..?

గుండె లోతుల్లో గునపం లా దిగబడ్డ బాధలకు..
ఉపశమనం లా నువ్వొచ్చావు..
ఆరని జ్వాల లాంటి గాయాలకు లేపనం పూసావు..!
ఆలోచనలతో అల్ల కల్లోల మైన తలను నిమిరి..
తలపులకు నిబ్బరాన్ని అందించావు..!
తీగె మీది నడక లాంటి జీవితానికి ఊతమై నిలిచావు..
"నీకోసమే నేను" అంటూ
మనసు మీద వెన్నెల సంతకం చేసావు..!
అంతటితో ఆగావా..?
"తుమ్ సే అచ్చా కౌన్ హై .." ఆన్నావు..
ఆ మాట దేహాన్ని మంత్రమై స్పృసించింది..
మైమరపించింది..!
కలనై..అలనై..వెన్నెలనై..
పొంగి..ఉప్పొంగి..నింగి కెగసి పోతున్న నాకు..
ఈ ప్రపంచం చాలా ఇరుకుగా తోస్తోంది..
అందుకే ఎగిరోస్తున్నా నీ గుండె గూటిలోకి
గువ్వనై ఒదిగి పోయేందుకు..!

అడుగు ముందుకేసాక..

గుచ్చు కుంటున్న కాలం మేకులను ..
తొలగించడానికి నా శక్తి ఏపాటిది..?
జీవితం సితారు మీద సప్త స్వరాలు
మీటు కుంటూ సాగి పోవడం తప్ప..!
జీవిత ప్రయాణంలో ..
గమ్యాన్ని చేరు కోవడమే ముఖ్యం కాదని..
మొత్తం సుదీర్ఘ ప్రయాణాన్ని
ఆస్వాదించాలని..ఆనందించాలని..నేర్చుకున్నాక..
సంతోషమైనా..విషాదమైనా...
ప్రశ్న అయినా..పరిష్కారమైనా..
నాకు నేనే అయాక..
చూపులకీ ఆలోచనలకీ మధ్య సూత్రాన్ని నేస్తూ..
గమ్యానికీ గమనానికీ నడుమ అగాధాన్ని తుంచుతూ..
నిర్భయంగా అడుగు ముందుకేసాక..
ఇక ఎదురేముంది..?
అన్వేషించిన తీరాన్ని జీవన నౌక చేరబోతోందని..
గమ్యం గమకాలు పలుకుతూ ఎదురోస్తుందని..
వేరే చెప్పాలా...?

14, అక్టోబర్ 2011, శుక్రవారం

అశ్రువుల్లో తడిసిపోతున్న మౌనం...
కొట్టు మిట్టాడుతున్న ఆఖరి ఆశా దీపం..
ఆన కట్టలు తెంచుకున్న దుఃఖ ప్రవాహం..
ఏరులై పారుతున్న సోక సంద్రం..
నా జీవితానికి నేనే
చితి అంటించు కుంటున్న అనుభూతి..!
అర్ధం కాని అయోమయ స్థితి..!
ఒక్కొక్కటిగా నిష్క్రమిస్తున్నాయా
నా జీవితం లోంచి..
శాంతి..
సంతోషం..
సంతృప్తి...???

13, అక్టోబర్ 2011, గురువారం

ఆలోచనలతో..ఆవేదనలతో..నిమిత్తం లేకుండా..
కదలి పోతూనే వుంది కాలం..
రోజులు గడిచి పోతున్నా గడియ పడ్డ
అదృష్ట ద్వారం తెరుచుకొనే లేదు..
మింగేస్తున్న కాల భూతం కనికరించనే లేదు..
ఆఖరి ఆశ కూడా ఆరిపోయి ..
సన్నటి పొగ మాత్రం వస్తున్నట్టు..
అయిపొయింది..
అంతా అయిపొయింది..
ఎవరూ ఈ జీవితానికి నిప్పంటించింది ..?
ఎవరూ నా కలల సామ్రాజ్యాన్ని
భూస్థాపితం చేసింది..?

ఏమనుకున్నా ఏముంది..?

ఎలా..ఎలా.. ఈ ప్రపంచాన్ని నమ్మడం..?
దేన్నీ నమ్మాలి..ఎవరిని నమ్మాలి..?
ఇలా కూడా జరుగుతుందా..?
నమ్మకపు పునాదులతో నిర్మించుకున్న జీవిత సౌధాలు ..
ఇలా నిట్ట నిలువునా నేల కూలి పోతాయా..?
కళ్ళ వెంట నీళ్ళు రావడం లేదు..
దుఖం పొంగి పొర్లడం లేదు..
మనసు మొద్దు బారి పోయి ..గుండె చప్పుడు ఆగి పోయి..
అయినా జ్ఞాపకం వస్తున్నాయి..
ఒక్కో దృశ్యమూ..ఒక్కో సంఘటనా...
అన్నీ కళ్ళ ముందే ..మనసు వాకిలి ముందే పరచుకున్నాయి..
అయిపొయింది..!
ఇంకా ఎం మిగిలింది..?
భువన వేదిక మీద నిర్మించుకున్న
స్వప్నాల హర్మ్యాలు..

పేక మేడల్లా కూలిపొయాక..!
 
 
 
 
 

ఎవరి కోసమిలా..?

జీవితంలో..
ఈ పరాయితనం ఎందుకేర్పడుతోంది..?
అసలు ప్రశ్నఇదే..!
జీవితం నా నుండీ
ఎందుకు తప్పించుకు పోతోంది..?
ఒకటే సందేహం..!
కీ ఆగిపోయిన గడియారంలా..
నిస్సత్తువగా..నిర్లిప్తంగా..ఎందుకిలా వున్నాను..?
ఎవరి కోసం..?
ఎవరికోసమిలా నా నుండీ విడిపోయి
కొత్త ఆశతో..చూపుతో నిరీక్షిస్తున్నాను..?
హృదయాన్ని విప్పార్చుకుని ..స్వప్న స్వగతాలతో నింపుకుని..
ఏ అడుగు సవ్వడి కోసం ఇదంతా..?
జీవితానికీ నాకూ మధ్య..
ఇంకా ఈ పెనుగులాట దేనికని..?

ఇలాగైనా..

జీవన్మరణ సరిహద్దు రేఖ పై నిలచి...
నరక యాతన పడుతున్న ఈ క్షణాల్లో సైతం
నాకు చావాలని లేదు..
ఒకరిని చంపాలనీ లేదు..
నా పరిధిలో నేను బతకాలని..
మరొకరికి భారం కాకుండా బాధ పెట్టకుండా..బతికినన్నాళ్లు
పావురాయి రెక్కలా..కస్తూరి చుక్కలా..
స్వచ్చంగా..సుగంధ భరితంగా..బతకాలని వుంది..!
కానీ ప్రభూ..
అడకత్తెరలో పోక చెక్కలా నన్నిలా ఇరికించావే..
రెండు వైపులా పదునైన కత్తి అంచులు
కుత్తుకను అదిమేస్తున్నాయి..
బొట్టు బొట్టుగా రాలుతున్న రుధిరాన్ని చప్పరిస్తున్నాయి..
క్షణం ఆలస్యమైతే బతుకు దయనీయంగా ముగిసి పోతుంది.
ఇంకా ఆలోచన దేనికి ప్రభూ..?
ఒక మహా ప్రళయం కమ్ముకొస్తోంది..
ఒక మహా నిస్తేజం ముంచుకొస్తోంది..
జీవితాన్నే కాటేయబోతోంది..
నేను జీవించాలి ప్రభూ..
నా లక్ష్యం కోసం...చేరాల్సిన నా గమ్యం కోసం..!
ఈ మనుషుల అవకాశ వాదాలకీ..
కక్షలకీ..కార్పణ్యాలకీ ..అతీతంగా..
నాదైన ప్రపంచంలో నా మానాన నేను బ్రతుకుతున్నా కదా..
ఇలాగైనా నన్ను బ్రతకనీవా ప్రభూ..?