పేజీలు

13, అక్టోబర్ 2011, గురువారం

ఇలాగైనా..

జీవన్మరణ సరిహద్దు రేఖ పై నిలచి...
నరక యాతన పడుతున్న ఈ క్షణాల్లో సైతం
నాకు చావాలని లేదు..
ఒకరిని చంపాలనీ లేదు..
నా పరిధిలో నేను బతకాలని..
మరొకరికి భారం కాకుండా బాధ పెట్టకుండా..బతికినన్నాళ్లు
పావురాయి రెక్కలా..కస్తూరి చుక్కలా..
స్వచ్చంగా..సుగంధ భరితంగా..బతకాలని వుంది..!
కానీ ప్రభూ..
అడకత్తెరలో పోక చెక్కలా నన్నిలా ఇరికించావే..
రెండు వైపులా పదునైన కత్తి అంచులు
కుత్తుకను అదిమేస్తున్నాయి..
బొట్టు బొట్టుగా రాలుతున్న రుధిరాన్ని చప్పరిస్తున్నాయి..
క్షణం ఆలస్యమైతే బతుకు దయనీయంగా ముగిసి పోతుంది.
ఇంకా ఆలోచన దేనికి ప్రభూ..?
ఒక మహా ప్రళయం కమ్ముకొస్తోంది..
ఒక మహా నిస్తేజం ముంచుకొస్తోంది..
జీవితాన్నే కాటేయబోతోంది..
నేను జీవించాలి ప్రభూ..
నా లక్ష్యం కోసం...చేరాల్సిన నా గమ్యం కోసం..!
ఈ మనుషుల అవకాశ వాదాలకీ..
కక్షలకీ..కార్పణ్యాలకీ ..అతీతంగా..
నాదైన ప్రపంచంలో నా మానాన నేను బ్రతుకుతున్నా కదా..
ఇలాగైనా నన్ను బ్రతకనీవా ప్రభూ..? 






కామెంట్‌లు లేవు: