పేజీలు

31, అక్టోబర్ 2014, శుక్రవారం

VIJAYAM ANTE...

విజయం అంటే ...
ఆశించిన దాన్ని సాధించడం కాదు ....
సాధించాల్సిన దాన్ని ఆశించడం ...

          గెలవాలన్న తపన తగ్గితే
          ఓటమికి తగ్గరైనట్టే ...
          ఓటమికి భయ పడి నంత కాలం ...
          గెలుపుని స్వాగతించే ధైర్యం చెయ్య లేం ...


What is FAILURE?

నీలోని లోపాన్ని
సరి దిద్ద డానికి  దేవుడు
వేసే ఉలి దెబ్బే ఓటమి ...

           అందుకే వైఫల్యాన్ని
            మనసు లోకి తీసుకోవద్దు ...
            విజయాన్ని
            తల కెక్కించు కొవద్దు...

నీ విజయంలో
ఆనందాన్ని వెతుక్కో ...
నీ వైఫల్యంలో హాస్యాన్ని వెతుక్కో ...
ఇక నిరాశ కి చోటెక్కడ వుంది ...?

KERATAM

కెరటం ఒక హీరో ...
ఎగిసి పడుతున్నందుకు కాదు ...
పడ్డా లేస్తున్నందుకు ...

       తప్పులూ  పొరపాట్లతో
       ఓటమి రాదు
       ఆ అనుభవాల నుండి
       గుణ పాఠం నేర్చు కోక పోవడం వల్ల వస్తుంది ...

వైఫల్యం  నిరాశ కి
కారణం కాకూడదు ...
కొత్త ప్రేరణ కు పునాది కావాలి


PARAJAYAM ANTE...?

పరాజయం అంటే ...
చేసే పనిని వదిలి పారి పొమ్మని కదు.
ఆ పనిని మరింత శ్రద్ధగా నేర్పుగా పట్టుదలగా ..
చేయమని అర్ధం ...

     ఏ విజేత చరిత్ర చూసినా ..
     అతి పెద్ద వైఫల్యాల తర్వాతే
     అతి గొప్ప విజయాలు వుంటాయి ....

"విజయ రహస్యం " ఓ అర్ధం లేని మాట ...
విజయం వెనుక రహస్యాలు వుండవు ...
వైఫల్యాలు మాత్రమే వుంటాయి

18, అక్టోబర్ 2014, శనివారం

చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..

చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..: ఏ కల్మషము లేని స్వచ్చ మైన  ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు   ఇంతగా ఆరాట పడుతోంది? అగరు పొగల ధూపం లోని పవిత్రత .. వైశాఖ మాసపు వాన ...

12, అక్టోబర్ 2014, ఆదివారం

చెలువం..: SECRET OF LIFE

చెలువం..: SECRET OF LIFE: జీవితం ఓ యుద్ధ రంగం . పోరాడి గెలవాలి . నీ ప్రయత్నం ఆప నంత వరకూ నువ్వు ఓడి పోనట్టే లెక్క              నిరంతరం వెలిగే సూర్యుణ్ణి       ...

చెలువం..: NINNU...NEEKU

చెలువం..: NINNU...NEEKU: గెలుపు .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది .. ఓటమి ... నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది .. ఆ అనుభవం .. నీకో కొత్త విషయాన్నీ నే...

8, అక్టోబర్ 2014, బుధవారం

NINNU...NEEKU

గెలుపు ..
ప్రపంచానికి నిన్ను
పరిచయం చేస్తుంది ..

ఓటమి ...
నీకు ప్రపంచాన్ని
పరిచయం చేస్తుంది ..

ఆ అనుభవం ..
నీకో కొత్త విషయాన్నీ నేర్పినప్పుడు ..
దాన్ని  ఓటమి  అని ఎందుకు అనాలి ?
పాఠం అని అనుకోవచ్చు కదా