19, సెప్టెంబర్ 2011, సోమవారం
కంటి ముందు కనిపించే కర్తవ్యం
గడ్డ కట్టుకు పోయి నా మనసిలా నిర్వికారమై పొయిందేమిటి?
ఈ కష్టాల కడలిలో ..
స్పృతుల కెరటాలు కూడా కదల వెందుకు..?
విజ్ఞానపు వెన్నెల మీద దట్టమైన మబ్బులు ఇలా పరచు కున్నాయేమిటి..?
వ్యక్తిత్యపు దీపం మీద చీకటి తుఫాను ఇలా విరుచుకు పడిందేమిటి..?
కధ ముగింపు కొస్తున్నా ఇంకా వ్యధ తొలగి పోదేమిటి..?
ఈ విశాల విశ్వం మీద వెలుగులు ప్రసరించ వలసిన నేను..
ఈ అగడ్తలను జయించి విజయం సాధించాల్సిన నేను..
కష్టానికీ..కన్నీటికీ..స్థానం లేకుండా చెయ్యాల్సిన నేను..
ఇవాళ ..ఇలా ..ఈ చిక్కని చీకటిలో.. వెచ్చని కన్నీటి లో ..
ఒంటరి తనంతో..రుద్ధ మైన కంఠంతో ..
విషాద గీతాన్ని వినిపిస్తున్నానని...విస్తు పోతారెందుకు..?
ఆయుధాన్ని నేను వదల లేదు..
పోరాటాన్ని ఆపలేదు..
అలసట తీరక అడుగు ముందుకే నని వేరే చెప్పాలా...?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)