30, జనవరి 2012, సోమవారం
చెలువం..: అయితేనేం...
చెలువం..: అయితేనేం...: ఎవరూ లేక.. ఏ ఒక్కరూ కలసి రాక.. కాల తీరాన ఒంటరిగా నడిచాను మమతలకీ మమకారాలకీ నోచుకోక .. బీడునై మోడునై ఎండి పోయాను ఎన్నో సార్లు చావు ...
చెలువం..: కరిగి పోనీకు కలలా...
చెలువం..: కరిగి పోనీకు కలలా...: నీ పాదం నా హృదయంలో తొలి అడుగు వేసాక.. నీవు కనిపించడం .. వినిపించడం.. క్షణం ఆలస్యమైనా .. తట్టుకోలేక ..తమాఇంచుకోలేక తమకంతో నేనూగి పోతుం...
27, జనవరి 2012, శుక్రవారం
చెలువం..: FOR YOU..!
చెలువం..: FOR YOU..!: Dont you believe, when i say that i have something.. That can be called my own. It is a dream..,a dream of my love! A dream fragranced w...
చెలువం..: OCEAN of LOVE
చెలువం..: OCEAN of LOVE: Daily in the morning..i see some dew drops.. on the breasts of the leaves of grass.., But when the sun rises.. I know not where they dis...
చెలువం..: WOMEN
చెలువం..: WOMEN: Women was made.. Not from man's head..to be above him.. Not from his foot.. to be stamped by him. But from his side .. to be equal to hi...
చెలువం..: ITS NOT A DREAM
చెలువం..: ITS NOT A DREAM: Can you hear the wheels of time.. Rolling in ceaseless motion.. Awakening all human hearts.. It is these ruthless wheels that separate...
చెలువం..: ITS NOT A DREAM
చెలువం..: ITS NOT A DREAM: Can you hear the wheels of time.. Rolling in ceaseless motion.. Awakening all human hearts.. It is these ruthless wheels that separate...
18, జనవరి 2012, బుధవారం
చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?
చెలువం..: వచ్చేనా నూతన వత్సరం..?: కాలం ఒక ఇంద్ర జాలం.. గమ్మత్తు లెన్నో చేసి .. గుంభనంగా కదలి పోతూనే వుంటుంది.. నిరంతర ప్రవాహం లా సంవత్సరాలు.. చిటికెలో గిర్రున తిరిగి పోత...
చెలువం..: విజయం.
చెలువం..: విజయం.: ఓడిపోయావంటే..దాని అర్ధం... నీ జీవితం వ్యర్ధం అయిపోయిందని కాదు.. ఒక రహస్యం తెలుసుకున్నావని.., ఇంకా గట్టిగా ప్రయత్నించాలని అర్ధం.. మెట్ల ...
17, జనవరి 2012, మంగళవారం
చెలువం..: ఎలా..?
చెలువం..: ఎలా..?: మానవ సంబంధాల మద్య.. అంతర్వాహినిలా ప్రవహించాల్సిన ప్రేమ జలధి ఎండి ఇంకి పోయాక .. బంధాలు విచ్చిన్నం కాక ఏమైతుంది..? నమ్మకా...
చెలువం..: వెన్నెల విరబూసింది..చల్లని గాలి కెరటాల మీద గుండె ...
చెలువం..: వెన్నెల విరబూసింది..
చల్లని గాలి కెరటాల మీద గుండె ...: వెన్నెల విరబూసింది.. చల్లని గాలి కెరటాల మీద గుండె గుడిలో పండించుకున్న ఆశల పల్లవి మూగగా..నిశ్శబ్దంగా వినిపిస్తూంది.. అవును.. ఆ...
చల్లని గాలి కెరటాల మీద గుండె ...: వెన్నెల విరబూసింది.. చల్లని గాలి కెరటాల మీద గుండె గుడిలో పండించుకున్న ఆశల పల్లవి మూగగా..నిశ్శబ్దంగా వినిపిస్తూంది.. అవును.. ఆ...
11, జనవరి 2012, బుధవారం
తొలి గురువు..
' గుండె వేడెక్క నీయకు ' అంటుంది మంచు గడ్డ.
' స్థిరంగా ధైర్యంగా వుండు..' అంటుంది పర్వతం..
' ఎప్పటిది అప్పుడు చెయ్యి ' అంటుంది కాలం..
'గంభీరంగా వుండు' అంటుంది సముద్రం..
'ప్రతీ రోజూ వేకువే ' అంటాడు సూర్యుడు..
'చల్లగా శాంతంగా వుండు' అంటాడు చంద్రుడు..
'స్వచ్చంగా బ్రతక మంటుంది' వెన్నెల..
'సుకుమారంగా సున్నితంగా ఉండ మంటుంది' పువ్వు..
'పది మందికీ నీడ నివ్వు 'అంటుంది వృక్షం..
'నీ యోగ్యతని ఎప్పుడూ వ్యర్ధం చేసుకోకు ' అంటుంది వాన చినుకు..
'ఆవేశం అనర్ధం సుమా' అంటుంది ఉప్పెన..
ఇలా కావలిసినంత నేర్పు తుంది ప్రకృతి..
చూసి నేర్చుకోవాలే గానీ..
మనిషికి ప్రకృతిని మించిన గురువు ఎవరు..?

9, జనవరి 2012, సోమవారం
6, జనవరి 2012, శుక్రవారం
చెలువం..: ఆట ముగిసింది..!
చెలువం..: ఆట ముగిసింది..!: ఆమె.. ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.. ప్రతికూల పరిస్థితులను ఎదిరించింది.. ప్రతీ సమస్యలో..ప్రతీ సమరం లో.. పరాజయం అన్న పదానికి ఇక్కడ అస్తిత్...
ఆట ముగిసింది..!
ఆమె..
ఎన్నో సమస్యలను ఎదుర్కొంది..
ప్రతికూల పరిస్థితులను ఎదిరించింది..
ప్రతీ సమస్యలో..ప్రతీ సమరం లో..
పరాజయం అన్న పదానికి ఇక్కడ అస్తిత్వం లేదు..
ప్రపంచం ఆమె ఔన్నత్యం ముందు తల వంచింది..
ప్రకృతి ఆమె ఔదార్యాన్ని చూసి ముచ్చట పడింది..
పర్వత శిఖరమై..
ధీర గంభీర జలదియై..
పచ్చ దనాల వృక్షమై..
ధైర్యంతో..స్థైర్యంతో..
అన్ని వైపరేత్యలనూ జయించింది..
పులు కడిగిన ముత్యం లాంటి ఆమెను చూసి..
మృత్యువు కూడా ముచ్చట పడింది..
ఆమెతో ముఖా ముఖీకి సరదా పడింది..
చిరు నవ్వు నవ్వుతూ చెప్పింది..
" నీ ఆట ముగిసింది.."

చెలువం..: వెలగనీ ఒక జ్యోతి ని..
చెలువం..: వెలగనీ ఒక జ్యోతి ని..: ఓ ప్రభూ..! స్నేహం కావాలని ఆరాటపడే వ్యక్తికీ నా స్నేహ హస్తం అందించేందుకు సహాయ పడు..! రవంత ప్రేమ కోసం అలమటించే మనసుకి.. స్వాంతన నందించే భ...
5, జనవరి 2012, గురువారం
వెలగనీ ఒక జ్యోతి ని..
ఓ ప్రభూ..!
స్నేహం కావాలని ఆరాటపడే వ్యక్తికీ
నా స్నేహ హస్తం అందించేందుకు సహాయ పడు..!
రవంత ప్రేమ కోసం అలమటించే మనసుకి..
స్వాంతన నందించే భాగ్యాన్ని నాకివ్వు..!
బాధను పంచుకోవాలని తహ తహ లాడే ఒక గుండెకి..
నా అవగాహనను అందించు..!
జీవితపు పిడికిలి దెబ్బలకు తల్లడిల్లిన మనిషికి..
నా సాధు స్వభావాన్నీ..,
ఏకాకిగా మిగిలిన మనిషికి నా చెలిమిని..,
అస్థిరంగా..అనిశ్చయంగా వున్నా మనిషికి నా నెమ్మది తనాన్నీ..,
నిరుత్సాహంగా ..నిర్లిప్తంగా వున్నా మనిషికి నా చైతన్యాన్ని..
ఆత్మీయుల అదృశ్యం వల్ల దుఃఖిస్తున్న హృదయానికి నా ఓదార్పు నీ ..
యుద్ధ రంగం లోని సైనికులకి నా ఆవేశాన్ని..,
నీ సృష్టి లోని సమస్త జీవుల పట్ల నా కనికరాన్ని..కరుణ నీ..,
అందించేందుకు నాకు సహాయ పడు..!
ఓ ప్రభూ..నా [ జీవన ] జ్యోతి దేదీప్య మానంగా
ప్రకాశించేoదుకు నాకు చేయూత నివ్వు.. !
స్నేహం కావాలని ఆరాటపడే వ్యక్తికీ
నా స్నేహ హస్తం అందించేందుకు సహాయ పడు..!
రవంత ప్రేమ కోసం అలమటించే మనసుకి..
స్వాంతన నందించే భాగ్యాన్ని నాకివ్వు..!
బాధను పంచుకోవాలని తహ తహ లాడే ఒక గుండెకి..
నా అవగాహనను అందించు..!
జీవితపు పిడికిలి దెబ్బలకు తల్లడిల్లిన మనిషికి..
నా సాధు స్వభావాన్నీ..,
ఏకాకిగా మిగిలిన మనిషికి నా చెలిమిని..,
అస్థిరంగా..అనిశ్చయంగా వున్నా మనిషికి నా నెమ్మది తనాన్నీ..,
నిరుత్సాహంగా ..నిర్లిప్తంగా వున్నా మనిషికి నా చైతన్యాన్ని..
ఆత్మీయుల అదృశ్యం వల్ల దుఃఖిస్తున్న హృదయానికి నా ఓదార్పు నీ ..
యుద్ధ రంగం లోని సైనికులకి నా ఆవేశాన్ని..,
నీ సృష్టి లోని సమస్త జీవుల పట్ల నా కనికరాన్ని..కరుణ నీ..,
అందించేందుకు నాకు సహాయ పడు..!
ఓ ప్రభూ..నా [ జీవన ] జ్యోతి దేదీప్య మానంగా
ప్రకాశించేoదుకు నాకు చేయూత నివ్వు.. !
చెలువం..: విజయం.
చెలువం..: విజయం.: ఓడిపోయావంటే..దాని అర్ధం... నీ జీవితం వ్యర్ధం అయిపోయిందని కాదు.. ఒక రహస్యం తెలుసుకున్నావని.., ఇంకా గట్టిగా ప్రయత్నించాలని అర్ధం.. మెట్ల ...
4, జనవరి 2012, బుధవారం
చెలువం..: పోరాటం..
చెలువం..: పోరాటం..: సూర్యోదయాలు..సూర్యాస్తమయాలు.. కళ్ళ ముందే కరగి పోతున్నాయి.. ఏళ్ళకి ఏళ్ళే గడచి పోతున్నాయి.. మొద్దు బారిన మనసుకు ..నిస్తేజంగా మారిన చూపుకు....
పోరాటం..
సూర్యోదయాలు..సూర్యాస్తమయాలు..
కళ్ళ ముందే కరగి పోతున్నాయి..
ఏళ్ళకి ఏళ్ళే గడచి పోతున్నాయి..
మొద్దు బారిన మనసుకు ..నిస్తేజంగా మారిన చూపుకు..
ఒక దాని వెంట ఒకటిగా వచ్చి పడుతున్న..
కష్టాలు..కన్నీళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు..
కంటికి నిద్ర కరువై..రాత్రికి పగలుకి తేడా తెలియదు..
బ్రతుకు బాటలో ఒంటరి ప్రయాణం చేస్తూ..
అడుగడుగునా సమస్యల సుడిగుండాలను అధిగమిస్తూ..
సాగిస్తున్న ఈ పోరాటం సామాన్య మైంది కాదు..
అనుభవాలే అధ్యాపకులుగా ..
జీవన ప్రాంగణమే పాఠశాలా గా..
నేర్చుకున్న కఠోర పాఠాలెన్నో..
ఈ చలి గాలుల్ని ..చీకటి రాత్రులని..చీల్చు కుంటూ..
ఒకనాడు సూర్యుడు ఉదయిస్తాడు.
హృదయా కాశంలో వెలుగు పూలు పూ యిస్తాడు.
ఎవరు గెలుస్తారో చూడాలని కాలం సైతం ..
కళ్ళు చించుకుని వీక్షిస్తోంది..
ప్రతీ విజయం ఆనందాన్నే ఇస్తుంది..
కానీ పోరాడి మరీ విజయాన్ని సాధించడం లోని..
ఆనందమే వేరు కాదా..?

చెలువం..: నీ ఆగమనం..
చెలువం..: నీ ఆగమనం..: బాల భానుడి బంగారు కిరణ మొకటి.. తోలి వేకువతో రహస్యం చెబుతున్న వేళ వచ్చావో.. సంజ కెంజాయ కాంతులు అంబరాన సంబరంతో ఊసులాడు వేళ వచ్చావో.. పండు...
నీ ఆగమనం..
బాల భానుడి బంగారు కిరణ మొకటి..
తోలి వేకువతో రహస్యం చెబుతున్న వేళ వచ్చావో..
సంజ కెంజాయ కాంతులు
అంబరాన సంబరంతో ఊసులాడు వేళ వచ్చావో..
పండు వెన్నెల ఓరగా జాజి పూవు మీద ఒరిగి..
జావళీలు పాడుతున్న వేళ వచ్చావో..
నాకు తెలియదు గానీ..
నీ 'ఆగమనం' నా హృదయం లో కూసిన కోయిల..
పడిలేచే సముద్రపు అల..
ఎప్పటికి కరగని తీయని కల..
మనసులో..జీవితంలో..అది ఓ చెరగని ముద్ర..
నీ రాక తో ..నా అస్తిత్యాన్ని మరచి..
నీలో లయించి పోయిన అనుభూతి..
గుండెలో ఇప్పటికీ పదిలంగా వుంది ..!

2, జనవరి 2012, సోమవారం
చెలువం..: హితుడు
చెలువం..: హితుడు: నీ సుఖ సంతోషాలకు .. ఎవరి కళ్ళు పద్మాలై వికసిస్తాయో.. నీ కష్ట నష్టాలకు .. ఎవరి కళ్ళల్లో అశ్రువులు ధారలు కడతాయో.. నీ దీనా వస్థలో.. ఎవరి ...
హితుడు
నీ సుఖ సంతోషాలకు ..
ఎవరి కళ్ళు పద్మాలై వికసిస్తాయో..
నీ కష్ట నష్టాలకు ..
ఎవరి కళ్ళల్లో అశ్రువులు ధారలు కడతాయో..
నీ దీనా వస్థలో..
ఎవరి గొంతు ఆర్తిగా వణుకు తుందో..
నీవు బాధతో క్రుంగి పోయినప్పుడు..
నీ వెనుక ఎవరు స్థిరంగా నిలబడతారో..
దిగులు - బెంగ చుట్టి ముట్టి నప్పుడు..
నువ్వు ఆవేదనతో ఎవరిని అల్లుకు పోతావో..
ఎవరి ప్రేమాభి మానాల వల్ల..
నీవు అనిర్వచ నీయమైన హాయిని అనుభ విస్తావో..
ఎవరి సమక్షంలో ..
నీ ప్రాణం సచేతనమై ఉల్లాసంగా తేలి పోతుందో..
ఎవరి ముందు..
నీవు ..నీవు గానే ప్రవర్తిస్తావో..
ఆ వ్యక్తే ..
నీ అసలైన హితుడు ..
స్నేహితుడు..!

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)