సూర్యోదయాలు..సూర్యాస్తమయాలు..
కళ్ళ ముందే కరగి పోతున్నాయి..
ఏళ్ళకి ఏళ్ళే గడచి పోతున్నాయి..
మొద్దు బారిన మనసుకు ..నిస్తేజంగా మారిన చూపుకు..
ఒక దాని వెంట ఒకటిగా వచ్చి పడుతున్న..
కష్టాలు..కన్నీళ్ళు తప్ప ఇంకేమీ కనిపించవు..
కంటికి నిద్ర కరువై..రాత్రికి పగలుకి తేడా తెలియదు..
బ్రతుకు బాటలో ఒంటరి ప్రయాణం చేస్తూ..
అడుగడుగునా సమస్యల సుడిగుండాలను అధిగమిస్తూ..
సాగిస్తున్న ఈ పోరాటం సామాన్య మైంది కాదు..
అనుభవాలే అధ్యాపకులుగా ..
జీవన ప్రాంగణమే పాఠశాలా గా..
నేర్చుకున్న కఠోర పాఠాలెన్నో..
ఈ చలి గాలుల్ని ..చీకటి రాత్రులని..చీల్చు కుంటూ..
ఒకనాడు సూర్యుడు ఉదయిస్తాడు.
హృదయా కాశంలో వెలుగు పూలు పూ యిస్తాడు.
ఎవరు గెలుస్తారో చూడాలని కాలం సైతం ..
కళ్ళు చించుకుని వీక్షిస్తోంది..
ప్రతీ విజయం ఆనందాన్నే ఇస్తుంది..
కానీ పోరాడి మరీ విజయాన్ని సాధించడం లోని..
ఆనందమే వేరు కాదా..?

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి