పేజీలు

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ముకిళిత హస్తాలతో...

ఓ సారి దారి తప్పి
వరదా బురదా అయినంత మాత్రాన..
గోదారి గోదారి కాక పోతుందా..?
ఓసారి చితికిందని చిన్నబోయిందని..
జీవితం జీవితం కాకుండా పోతుందా..?
ఓసారి ఓడినంత మాత్రాన
ఓడినట్టవుతుందా..?
ఓటమిని ఓడించ లేకపోతేనే ఓడినట్టు..!
ఓటమి తల వంచే వరకు..
విధితో పోరాడుతూనే వుంటాను..
 ఒక పోరాటంలా సాగుతున్న జీవితాన్ని..
అలసిపోని ఆరాటంతో అదుపు లోకి తీసుకుని ..
విజయం సాధిస్తాను..
తప్పదు..
ఏదో ఒక రోజు
ఓటమి తన ముకిళిత హస్తాలతో..
విజయాన్ని నాకందిస్తుంది..!