పేజీలు

29, జులై 2011, శుక్రవారం

ఆశా దీపం..

దూరాన..ఆకాశాన.. మిణుకు మిణుకు మంటూ ఓ ఆశా దీపం ..
దారీ తెన్ను తెలియని నాకు అభయ మిచ్చే అఖండ దీపం ..
ఆకాశాన వున్నా..అంతరాన  వున్నా ..
కొండ గాలి వీచినా..పెను తుఫాను కమ్ముకున్నా..
ఆరిపోదు ఆ దీపం ..
నాకు దారి చూపక మానదు ..
నూనె లేదా దీపానికి ..వత్తి లేదా దీపానికి ..
ప్రమిద అనేది అసలే లేదు ..
వున్నది ఒకటే ..
గుండెలో పరచుకున్న ఆర్ద్రత ..
అదే నాలో నిరంతరం..అనుక్షణం .
దేదీప్యమానంగా వెలిగే మణి దీపం



 
నా చుట్టూ కోటి దీపాలు ..
మహోజ్వల కాంతి పుంజంతో మిరుమిట్లు గొలిపే మణులు ..
వాటి మధ్య మిణుకు మిణుకు మంటూ నేను..
నలుగురిచే మెప్పు పొందే వెలుగు జిలుగులు నాలో వున్నా లేకున్నా
పది మంది ఆదరించు వ్యక్తిత్యపు కాంతి నాకున్న లేకున్నా
నన్ను నేను గౌరవిస్తూ ..
జీవితాన్ని ప్రేమిస్తూ ..
హృదయంతో నవ్వుతూ..
దట్టమైన చీకటిలో సైతం ..
చిరు కాంతిని పంచాలని ..
నేను వెలుగుతూనే వుంటాను!
దుఖమైనా..సంతోషమైనా ...పండినప్పుడు ..
ఒకే రూపాన్ని సంతరించుకుంటాయి ..
ఆ రూపానికి స్వరూపం వుండదు ..
ఆ భావానికి భాష్యం తెలీదు ..
ఆ షుప్త చేతనంలోని సుడిగాలి ..
సుషుప్తిలోనే విరగాలి ..
అందాకా భావభావం తప్పదు ..

ఒక వేకువ కోసం..

ప్రతీ ఉషోదయము కొత్త కాంతిని ..
ప్రతీ వేడి గుండె కొత్త పాటని ..
తెస్తున్నప్పుడు..
ఆ రసావర్ణం లో ..అన్ని బాధలు కరిగి పోక తప్పదు ...





ప్రేమంటే...

ప్రేమంటే ఒక వ్యక్తీ సాన్నిద్యాన్ని అను క్షణం కోరుకోవడం ..
ప్రేమంటే ' తన' గురించిన ఆలోచనలతో మనసంతా నిండి పోవడం ..
ప్రేమంటే ఆకాశంలో చంద్రబింబం 'సముద్రం' అద్దంలో ముఖం చూసుకోవడం ..
చంద్రబింబాన్ని ఆ సముద్రం తన అలల మధ్య బంధించడం..





స్తబ్దంగా వున్నజీవితంతో వేగడం ఎలా ?
కాలం దోర్లించడమే బ్రాహ్మ ప్రళయం గా వుంటుంది..
ఈ నిశబ్దం ఎంత భయంకర మైనది ..
క్రియా శూన్యత కఠిన మైన శిక్ష ..
పరిస్థితుల చట్రంలో జీవితం అసహాయంగా నలిగి పోతుంది ..
ప్రపంచం ప్రపంచంలా కనపడదు ..
కళ్ళ ముందు పరచుకున్న వెలుతురులో చీకటి గోచరిస్తుంది ..
చిరునవ్వుల సందడి విషాద గీతంలా వినిపిస్తుంది ..
క్షణాలు కదలలేక భారంగా కదలుతున్న
ఈ నీరస జీవితంలో ఏ నాడైనా..ఎప్పుడైనా ..
వచ్చేనా రసొదయం ..!