పేజీలు

12, నవంబర్ 2014, బుధవారం

చెలువం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..

చెలువం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..: చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం.. : ఏ కల్మషము లేని స్వచ్చ మైన  ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు   ఇంతగా ఆరాట పడుతోంది? అగరు పొగల ధూపం లోన...

3, నవంబర్ 2014, సోమవారం

చెలువం..: VIJAYAM ANTE...

చెలువం..: VIJAYAM ANTE...: విజయం అంటే ... ఆశించిన దాన్ని సాధించడం కాదు .... సాధించాల్సిన దాన్ని ఆశించడం ...           గెలవాలన్న తపన తగ్గితే           ఓటమికి తగ్గ...

చెలువం..: As it is..

చెలువం..: As it is..: గెలుపు .. నీ కళ్ళ లో మెరుపు నిస్తుంది ... మొహానికి వింత కాంతి నిస్తుంది .... నీలో లేని గొప్ప గొప్ప గుణాలని కూడా ఆపాదించి ప్రపంచానికి ని...

As it is..

గెలుపు ..
నీ కళ్ళ లో మెరుపు నిస్తుంది ...
మొహానికి వింత కాంతి నిస్తుంది ....
నీలో లేని గొప్ప గొప్ప గుణాలని కూడా ఆపాదించి
ప్రపంచానికి నిన్ను భూతద్దంలో చూపుతుంది ...
     
            ఓటమి  అలా కాదు ....
            ఆకాశం  మీద నుండి
            లాక్కొచ్చి నెల మీద నిలబెడుతుంది
            ఓడిపోయి నప్పుడే
            నువ్వు అచ్చంగా నీలా  వుంటావు ...
            అదే నీ నిజ రూపం
 

A new life

కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ...
ఎంత ఆనందంగా వుంటుంది ..
కొత్త కారులో వెళ్తుంటే
ఎంత హుషారుగా వుంటుంది ...
కొత్త పుస్తకం తెరవ గానే
ఎంత కమ్మని వాసన  వస్తుంది ......
 
      ఓటమి తరువాత మనం
      ప్రారంభించే కొత్త జీవితం లోనూ
      అంతే తాజా దనం వుంటుంది ...
     
ఓడిపోవడం అంటే ....
ఆ ఓటమికి కారణమైన
బద్దకాన్ని ... నిర్లిప్తతను ... అలసత్వాన్ని .... భయాన్ని ... అభద్రతను ...
శవ పేటికలో పెట్టి పూడ్చి వేయడమే ...
కర్రలు పేర్చి కాల్చేయడమే ....
ఆ బూడిద లోంచి .. ఆ మట్టి కుప్ప లోంచి ...
మరో మనిషిగా అవత రించడమే ....



31, అక్టోబర్ 2014, శుక్రవారం

VIJAYAM ANTE...

విజయం అంటే ...
ఆశించిన దాన్ని సాధించడం కాదు ....
సాధించాల్సిన దాన్ని ఆశించడం ...

          గెలవాలన్న తపన తగ్గితే
          ఓటమికి తగ్గరైనట్టే ...
          ఓటమికి భయ పడి నంత కాలం ...
          గెలుపుని స్వాగతించే ధైర్యం చెయ్య లేం ...


What is FAILURE?

నీలోని లోపాన్ని
సరి దిద్ద డానికి  దేవుడు
వేసే ఉలి దెబ్బే ఓటమి ...

           అందుకే వైఫల్యాన్ని
            మనసు లోకి తీసుకోవద్దు ...
            విజయాన్ని
            తల కెక్కించు కొవద్దు...

నీ విజయంలో
ఆనందాన్ని వెతుక్కో ...
నీ వైఫల్యంలో హాస్యాన్ని వెతుక్కో ...
ఇక నిరాశ కి చోటెక్కడ వుంది ...?

KERATAM

కెరటం ఒక హీరో ...
ఎగిసి పడుతున్నందుకు కాదు ...
పడ్డా లేస్తున్నందుకు ...

       తప్పులూ  పొరపాట్లతో
       ఓటమి రాదు
       ఆ అనుభవాల నుండి
       గుణ పాఠం నేర్చు కోక పోవడం వల్ల వస్తుంది ...

వైఫల్యం  నిరాశ కి
కారణం కాకూడదు ...
కొత్త ప్రేరణ కు పునాది కావాలి


PARAJAYAM ANTE...?

పరాజయం అంటే ...
చేసే పనిని వదిలి పారి పొమ్మని కదు.
ఆ పనిని మరింత శ్రద్ధగా నేర్పుగా పట్టుదలగా ..
చేయమని అర్ధం ...

     ఏ విజేత చరిత్ర చూసినా ..
     అతి పెద్ద వైఫల్యాల తర్వాతే
     అతి గొప్ప విజయాలు వుంటాయి ....

"విజయ రహస్యం " ఓ అర్ధం లేని మాట ...
విజయం వెనుక రహస్యాలు వుండవు ...
వైఫల్యాలు మాత్రమే వుంటాయి

18, అక్టోబర్ 2014, శనివారం

చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..

చెలువం..: ఒకా నొక ఆత్మ బంధం కోసం..: ఏ కల్మషము లేని స్వచ్చ మైన  ఒక ఆత్మబంధం కోసం ఎందుకు ఈ మనసు   ఇంతగా ఆరాట పడుతోంది? అగరు పొగల ధూపం లోని పవిత్రత .. వైశాఖ మాసపు వాన ...

12, అక్టోబర్ 2014, ఆదివారం

చెలువం..: SECRET OF LIFE

చెలువం..: SECRET OF LIFE: జీవితం ఓ యుద్ధ రంగం . పోరాడి గెలవాలి . నీ ప్రయత్నం ఆప నంత వరకూ నువ్వు ఓడి పోనట్టే లెక్క              నిరంతరం వెలిగే సూర్యుణ్ణి       ...

చెలువం..: NINNU...NEEKU

చెలువం..: NINNU...NEEKU: గెలుపు .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది .. ఓటమి ... నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది .. ఆ అనుభవం .. నీకో కొత్త విషయాన్నీ నే...

8, అక్టోబర్ 2014, బుధవారం

NINNU...NEEKU

గెలుపు ..
ప్రపంచానికి నిన్ను
పరిచయం చేస్తుంది ..

ఓటమి ...
నీకు ప్రపంచాన్ని
పరిచయం చేస్తుంది ..

ఆ అనుభవం ..
నీకో కొత్త విషయాన్నీ నేర్పినప్పుడు ..
దాన్ని  ఓటమి  అని ఎందుకు అనాలి ?
పాఠం అని అనుకోవచ్చు కదా

5, ఆగస్టు 2014, మంగళవారం

SECRET OF LIFE

జీవితం ఓ యుద్ధ రంగం .
పోరాడి గెలవాలి .
నీ ప్రయత్నం ఆప నంత వరకూ
నువ్వు ఓడి పోనట్టే లెక్క
 
           నిరంతరం వెలిగే సూర్యుణ్ణి
           చూసి చీకటి పారిపోతుంది .
           నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి
           ఓటమి భయ పడుతుంది .

గెలుపు శాశ్వ తం కాదు .
ఓటమి అంతిమం కాదు .
గెలవాలన్న తపన తగ్గితే
ఓటమికి దగ్గరైనట్టే .

           ఓటమి గురువు లాంటిది .
           ఏం చేయ కూడదో, ఎలా చేయ కూడదో
           అది నేర్పుతుంది

4, ఆగస్టు 2014, సోమవారం

POSITIVE FAILURE

మనిషికి పోరాటమే ఊపిరి .
ఓదినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది .
ఓటమి చెబితేనే గెలుపు పాటం బాగా అర్ధ మవుతుంది .
ఎప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ గెలెవ లేదన్నమాట .
ఓటమి రెండు రకాలు .
positive failure
negative failure
positive ఫెయిల్యూర్ injection  లాంటిది .
అప్పటి కప్పుడు నొప్పిగానే వుంటుంది .
కొన్ని రోజులు బాధ గానే వుంటుంది .
ఆ తర్వాత ... శత్రు దుర్భేద్య మైన కోటలా మనల్ని కాపాడుతుంది .

POSITIVE FAILURE  ఒకానొక రోజున పెద్ద SUCCESS కి దారి తీస్తుంది

3, ఆగస్టు 2014, ఆదివారం

happy failure

ఓటమికి భయపడ కండి .
ఓడి పోతే బాధ పడకండి .
వైఫల్యం తో పోయేదేం లేదు .
అహాలూ ... అహంభావాలూ తప్ప
ఏం ఫర్వా లేదు . ఓటమి పండగ  చేసు కోండి .
ఓటమి కేక్ కోసుకోండి .

  ఓడి పొండి .
  వీలైనంత త్యరగా
  వీలైనంత సుర క్షితంగా
  అదే చివరి సారి అన్నంత గొప్పగా

 HAPPY FAILURE