పేజీలు

2, జనవరి 2012, సోమవారం

హితుడు

నీ సుఖ సంతోషాలకు ..
ఎవరి కళ్ళు పద్మాలై వికసిస్తాయో..
నీ కష్ట నష్టాలకు ..
ఎవరి కళ్ళల్లో అశ్రువులు ధారలు కడతాయో..
నీ దీనా వస్థలో..
ఎవరి గొంతు ఆర్తిగా వణుకు తుందో..
నీవు బాధతో క్రుంగి పోయినప్పుడు..
నీ వెనుక ఎవరు స్థిరంగా నిలబడతారో..
దిగులు - బెంగ చుట్టి ముట్టి నప్పుడు..
నువ్వు ఆవేదనతో ఎవరిని అల్లుకు పోతావో..
ఎవరి ప్రేమాభి మానాల వల్ల..
నీవు అనిర్వచ నీయమైన హాయిని అనుభ విస్తావో..
ఎవరి సమక్షంలో ..
నీ ప్రాణం సచేతనమై ఉల్లాసంగా తేలి పోతుందో..
ఎవరి ముందు..
నీవు ..నీవు గానే ప్రవర్తిస్తావో..
ఆ వ్యక్తే ..
నీ అసలైన హితుడు ..
స్నేహితుడు..!

కామెంట్‌లు లేవు: