పేజీలు

11, జనవరి 2012, బుధవారం

తొలి గురువు..

' గుండె వేడెక్క నీయకు ' అంటుంది మంచు గడ్డ.
' స్థిరంగా ధైర్యంగా వుండు..' అంటుంది పర్వతం..
' ఎప్పటిది అప్పుడు చెయ్యి ' అంటుంది కాలం..
'గంభీరంగా వుండు' అంటుంది సముద్రం..
'ప్రతీ రోజూ వేకువే ' అంటాడు సూర్యుడు..
'చల్లగా శాంతంగా వుండు' అంటాడు చంద్రుడు..
'స్వచ్చంగా బ్రతక మంటుంది' వెన్నెల..
'సుకుమారంగా సున్నితంగా ఉండ మంటుంది' పువ్వు..
'పది మందికీ నీడ నివ్వు 'అంటుంది వృక్షం..
'నీ యోగ్యతని ఎప్పుడూ వ్యర్ధం చేసుకోకు ' అంటుంది వాన చినుకు..
'ఆవేశం అనర్ధం సుమా' అంటుంది ఉప్పెన..
ఇలా కావలిసినంత నేర్పు తుంది ప్రకృతి..
చూసి నేర్చుకోవాలే గానీ..
మనిషికి ప్రకృతిని మించిన గురువు ఎవరు..?

కామెంట్‌లు లేవు: