కాలం చూసావా ప్రియతమా
కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో..
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
పంచ రంగులతో అపురూపంగా నేస్తూ..
రోజులన్నీ నిశబ్దంగా నిష్క్రమిస్తూనే ఉన్నాయ్
గుడిలోని గంటలా నీపేరు నిరంతరం
గుండెలో మారు మ్రోగుతూనే వుంది..
సరమై..సంబరమై..ముమ్మరమై..అంబరమై..
నీ జ్ఞాపకాల పరిమళాలు అలల్లా..
నన్ను కమ్ముకుంటూనే ఉన్నాయ్
నీ మాటల రాపిడిలో నా నయనాలు..
నక్షత్రాలై మెరిసి పోతుంటే..
పెదవులు పై రంగు రంగుల..
సీతాకోక చిలుకలు ఎగురుతుంటే..
ఒక ఆనందం లోకి ..
ఒక అద్యైతం లోకి..
నే జారి పోతుంటాను..
అనుభూతుల అంచులను చేరుకుంటాను..!
కొవ్వొత్తి లా ఎలా కరిగి పోతోందో..
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
పంచ రంగులతో అపురూపంగా నేస్తూ..
రోజులన్నీ నిశబ్దంగా నిష్క్రమిస్తూనే ఉన్నాయ్
గుడిలోని గంటలా నీపేరు నిరంతరం
గుండెలో మారు మ్రోగుతూనే వుంది..
సరమై..సంబరమై..ముమ్మరమై..అంబరమై..
నీ జ్ఞాపకాల పరిమళాలు అలల్లా..
నన్ను కమ్ముకుంటూనే ఉన్నాయ్
నీ మాటల రాపిడిలో నా నయనాలు..
నక్షత్రాలై మెరిసి పోతుంటే..
పెదవులు పై రంగు రంగుల..
సీతాకోక చిలుకలు ఎగురుతుంటే..
ఒక ఆనందం లోకి ..
ఒక అద్యైతం లోకి..
నే జారి పోతుంటాను..
అనుభూతుల అంచులను చేరుకుంటాను..!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి