పేజీలు

18, అక్టోబర్ 2011, మంగళవారం

నీవు నాకు..

"నేను నీకెవరిని..నీకే మవుతానని.."
చాలా సార్లు అడిగావు..!
కొన్నేళ్ళుగా అన్వేషణ సాగిస్తూ ..
అంతర్మధనం లో ..ఉపాసన లో..అలమటిస్తూ..
నీ కోసమే వెతుకుతున్న నేను..
నీ దర్శనంతో పులకితుడనై..
ఎన్నో గంటలు ఎన్నో రోజులు నీ గురించిన
ఆలోచన ..ఆరాధన..ఆవేశాలతో..
నిండిన తపస్సు లో మునిగి ..
సంలీనమై..తదాత్మత చెంది..
నీ భక్తుడిని ..నీ ఆరాధకుడిని
అని గర్వ పడిపోతూ కూడా..
నిన్ను వివరించి విశ్లేషించేందుకు..
ఇన్ని వేల అక్షరాలు సృజించినా..
నీవేంటో చెప్పగల
ఒక్క అక్షరాన్నీ సృష్టించ లేక పోయాను..!
ఓ మహోన్నత స్త్రీత్వమా..
నీవు నాకేమవుతా వన్న ప్రశ్న ఎందుకు..?
నీవెవరో ..ఏమిటో ..
నాకు కాకపోతే ఎవరికీ తెలుస్తుంది..?
ఆ అవకాశం.. అర్హత ..ఇంకెవరికీ లేదు.
నాకు తప్ప..!
ఎందుకంటే నేను నీ సన్నిధి లో నిలచి
నీ వ్యక్తిత్యాన్నీ..నీ హుందాతనాన్నీ
నిరంతరం ఆవాహన చేసుకుంటున్న
తాపసిని ..!

కామెంట్‌లు లేవు: