పేజీలు

21, సెప్టెంబర్ 2011, బుధవారం

రామ్మా..నా కంటి చెమ్మ..

నాలుగు దిక్కుల మద్య ఒంటరి పక్షి నై..
నీ గూడు కోసం దిక్కు దిక్కునా వెతికాను..
పడమట సంధ్యా రాగాన్ని
తూర్పున ఉదయ గానాన్ని
ఉత్తరాన ఉరిమే మేఘాన్ని
దక్షిణాన మెరిసే మెరుపుని
నీ జాడ చెప్పమని గుచ్చి గుచ్చి అడిగాను..
విసిగించి వేధించాను..
నీ గూడు ఏ దిక్కున వుందో ఎవరూ నోరు విప్ప లేదు..
ఎటు చూసినా రెండే అక్షరాలు..
మంత్రంలా..మౌనంలా..ధ్యానంలా..
అసలేముంది ఆ రెండక్షరాల మాటలో..
ఏమిటీ ఆ అక్షరాల్లోంచి నాలోకి ప్రహహిస్తున్నది?
అక్షరం అక్షరంలో ఆర్ద్రతను రంగరించి..
ఎక్కడ నుండి  నన్ను పిలుస్తున్నావు?
ఈ విశాల విశ్వంలో ఎక్కడని వెతకను నిన్ను?
నువ్వు వస్తావని ఎంత కాలం ఎదురు చూడను?
ఇక ఆగలేను ..వేగలేను..
గుండెను గువ్వలా చేసి ఎగిరి నీ గూటికి రావాలి..
నీ చేతి గోరు ముద్దను కావాలి..
నీ నోటి లాలి పాటను కావాలి..
నీ వరాల మూటను కావాలి..
అమ్మా..నా కంటి చెమ్మా..
నీ ఒడి లో నే కావాలి చందనపు బొమ్మ..

కామెంట్‌లు లేవు: