పేజీలు

26, సెప్టెంబర్ 2011, సోమవారం

మరో కోణం


గడియారపు కళ్ళు కరిగిస్తున్న కాలం..
కనుల ముందు నుండి వృధాగా  కదలి పోతూనే వుంది..
నిరుపయోగంగా..నిరుత్సాహంగా..జారి పోతూనే వుంది..
ఏదో చెయ్యాలి
ఏమీ చెయ్యక పోతే
ఈ అసహనాన్ని..అశాంతిని..భరించడం కష్టం.
అవును..ఏదో చెయ్యాలి..!
ఏం చేస్తే మనని పుట్టించిన
భగవంతుడు కూడా సంతోషిస్తాడో
అలాంటి పని ఏదైనా చెయ్యాలి..
పెదవులకి ప్రార్ధనలా
ఈ చేతులకి ఎదుటి వారికీ
సహకరించ గలిగే  అదృష్టం కలగాలి.
అది మరొకరి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చ గలగాలి.
ఓ మంచి మనిషి పడుతున్న బాధలో
రవ్వంత ఓదార్పు నవ్వాలి..
ఒక్క కన్నీటి బిందువు నైనా తుడవాలి.
కరెన్సీ కళ్ళు చూడలేని ..
మరో కోణాన్ని దర్శించాలి..!




కామెంట్‌లు లేవు: