తర తర లాడుతూ తాటాకు మంట లాగా ..
చప్పున ఎగసి చల్లారి పోయేది కాదు నా జ్ఞాపకం నీ లోపల..
నేను చల్లగా అందని జాబిల్లిగా నీ గుండెలో వెలిగే గుప్త జ్వాలను ..
నా జ్ఞాపకాలు నక్షత్రాలై మిణుకు మిణుకు మంటూ ..
నీ హృదయాకాశంలో ఎప్పుడూ నిలిచే వుంటాయి శాశ్వతంగా ..!
నీవు పీల్చే గాలిలోని కమ్మని మట్టి వాసనని నేను..
నీ చుట్టూ కమ్మే వర్ష శీకర శైత్యం లోని ఆహ్లదాన్నే నేను..
నడి రాతిరిలో నీ పసి మనస్సు వెతుక్కునే అమ్మ ఒడి వెచ్చదనాన్ని నేను..
నా వైపుకు ఒక్క క్షణమైనా ఊహను సారించకుండా ఉండలేని ..
అశక్తతను నీలో పెంచిన నేను ..ఎవరో కాదు..
నీ నీడను..నీ తోడును..!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి